శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నమిత, ఫస్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వెంకటేష్ సరసన జెమినీ, రవితేజతో ఒకరాజు ఒకరాణి సినిమాల్లో కూడా నటించి, తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ప్రభాస్ తో బిల్లాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన నమిత, మధ్యలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు గడించింది. అయితే ఆ తరువాత ఎంతో బొద్దుగా తయారయిన ఈ ముద్దుగుమ్మ, ఆ మధ్య బాలయ్య సరసన సింహా సినిమాలో కూడా నటించడం జరిగింది. 

 

అయితే ఇటీవల పెళ్లి చేసుకుని తన భర్త తో కలిసి ఎంజాయ్ చేస్తున్న నమిత, మెల్లగా శరీర బరువుని తగ్గించుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఒక తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్ళిన నమిత, ఆ ఫంక్షన్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నిజానికి తనకు మొదటి నుండి సినిమాలు చూసే అలవాటు ఎక్కువ ఉందని, అలానే తాను ఎక్కువగా రొమాంటిక్ ఫీల్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఇష్టపడేదాన్నని ఆమె అన్నారు. 

 

కానీ రాను రాను ఇటీవల తన అభిరుచిలో మార్పు వచ్చిందని, ఇక ప్రస్తుతం ఎక్కువగా మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమాలనే చూడడానికి తాను ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది నిమిత. అంతేకాక తనకు రాబోయే రోజుల్లో అటువంటి సినిమాల్లో మంచి ఛాన్స్ లు వస్తే తప్పకుండా వాటిని మిస్ చేసుకోకుండా చేస్తానని అంటోంది నమిత. ఇక ఒకప్పటితో పోలిస్తే కొంత శరీర బరువును తగ్గించుకున్న నమిత, మరికొద్దిరోజుల్లో ఇంకా తగ్గి మళ్ళి సినీ అవకాశాలలు పట్టేస్తానని అంటోంది. మరి ఆమె ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: