విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా ఎన్నో అంచనాలతో వస్తుంది. 30 శాతం షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. దాదాపు 10 రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా దర్శకుడు శంకర్ కి భారీ గాయాలు అయ్యాయి. అలాగే మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో ఒక్కసారిగా తమిళ సినిమా భయపడుతుంది. 

 

సినిమా కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. దీనితో అక్కడి హీరోలు, దర్శకులు బాధపడుతున్నారు. కార్మికులకు భద్రత కరవవుతోందని హీరో  కమల్‌ హాసన్‌ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే నటులకు, కార్మికులకు అందరికి బీమా ఉండాలని పలువురు అంటున్నారు. ఈ డిమాండ్ ఎక్కువగా తమిళ సినిమాలో వినపడుతుంది. ఈ తరుణంలో శింబు హీరోగా నటిస్తున్న ‘మానాడు’ నిర్మాత సురేష్‌ కామాక్షి తన చిత్ర కార్మికులకు బీమా చేయించడం విశేషం. 

 

ఆయన... ఓ సంస్థతో దాదాపు రూ.30 కోట్ల విలువైన బీమా తన సినిమా నటులకు చేయించారని, దీనికి ఆయన రూ.7.8 లక్షలు ప్రీమియంగా చెల్లించారని చిత్ర యూనిట్ పేర్కొంది. కార్మికుల సంక్షేమం కోసమే ఈ బీమాను తీసుకున్నట్లు నిర్మాత మీడియాకు తెలిపారు. దీనిపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అనగానే కోటి ఆశలతో అడుగు పెడతారు కార్మికులు, అలాంటి కార్మికులు నేడు ఇలా అవ్వడం చాలా మందిని కన్నీరు పెట్టిస్తుంది. అందుకే ఇప్పుడు బీమా చేయిస్తే వారి కుటుంబాలకు అండ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా భారతీయుడు 2 సినిమా ఆగిపోయింది అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: