యువ హీరోలు వేగంగా సినిమాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. కెరీర్ మొదట్లో ఉన్న వాళ్ళు అయితే వేగంగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ ఉంటారు. మరీ రెండు మూడేళ్ళు గ్యాప్ తీసుకోవడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూడలేదు అనేది వాస్తవం. కాని మెగా హీరో రామ్ చరణ్ మాత్రం ఈ మధ్య రెండు మూడేళ్ళు గ్యాప్ తీసుకుంటున్నారు. రంగస్థలం సినిమాకు అలాగే తీసుకున్నారు. ఇప్పుడు వస్తున్న ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా అలాగే ఉన్నారు రామ్ చరణ్. 

 

ఇప్పుడు ఇదే చిరంజీవికి చికాకుగా మారింది అనే టాక్ ఎక్కువగా టాలీవుడ్ వర్గాల్లో వినపడుతుంది. ఆయన సినిమా విడుదల అవ్వడానికి ఇంకో ఏడాది ఉంది. కెరీర్ మొదట్లో ఉన్నప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ అవసరమా అని చిరంజీవి భావిస్తున్నారట. ఆ సినిమా కోసం మరో సినిమా కథ కూడా వినకపోవడం ఏంటీ అనే ఆగ్రహం చిరంజీవిలో వ్యక్తమవుతుంది. కనీసం కథలు చెప్పడానికి దర్శకులు వెళ్ళినా సరే రామ్ చరణ్ వినడం లేదని అంటున్నారు. చిరంజీవి ఇప్పటికే కొందరు దర్శకులను రామ్ చరణ్ వద్దకు పంపించారట. 

 

అయినా రామ్ చరణ్ ఏ కథను పూర్తిగా వినడం లేదని చిరంజీవి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఒక పక్క త్రివిక్రమ్ సినిమాను ఓకే చేసినా రామ్ చరణ్ మాత్రం ఇంకా ఆ సినిమాలో ఉన్నారని అది కెరీర్ కి అంత మంచిది కాదని అంటున్నారు చిరంజీవి కూడా. వచ్చే ఏడాది విడుదల అవుతుంది ఆ సినిమా. అంటే రామ్ చరణ్ షూటింగ్ జూన్ లేదా జూలై నెలలో పూర్తి అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి మరో సినిమా లైన్లో పెట్టుకుంటే మంచిది అని చిరంజీవి భావిస్తున్నారట. ఒక పక్క మెగా హీరోలు వరుసగా సినిమాలు చేస్తుంటే రామ్ చరణ్ ఒక సినిమా దగ్గరే ఆగిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: