అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు పవన్. ఒక పక్క పింక్ సినిమా లో నటిస్తూనే మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా కు అంగీకారం తెలపగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా లో పవన్ సరికొత్తగా కనిపిస్తారని అంటున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు పవన్. 

 

సినిమా కూడా జూన్ తర్వాత సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ అనే సినిమా లో నటిస్తున్నాడు. పింక్ సినిమా కు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా తర్వాతే క్రిష్ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్న‌ట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ నటించ‌బోతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

ప‌లువురు హీరోయిన్స్ పేర్ల‌ను ప‌రిశీలించిన చిత్ర యూనిట్ చివ‌ర‌కు కీర్తిసురేశ్‌ ని ఎంపిక చేసారని అంటున్నారు. ఇంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ‘అజ్ఞాత‌వాసి’ చిత్రంలో కీర్తిసురేశ్ న‌టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి కొన్ని సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ 2023 నాటికి విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన దాదాపు ఆరు సినిమాలను చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కవగా జరుగుతుంది.  ఇంకెన్ని సినిమాలు ఓకే చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: