స్వీటీ అనుష్క పెళ్లిపై లేటెస్ట్ గా ఓ కొత్త న్యూస్ ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతుంది. అనుష్క త్వరలోనే వెటరన్ డైరక్టర్ కొడుకుని పెళ్లాడబోతుందని టాక్. ఆల్రెడీ పెళ్లైన అతను కొన్నాళ్ల కిదట ఆమెతో డైవర్స్ తీసుకున్నారు. అతన్నే అనుష్క పెళ్లాడుతుందని లేటెస్ట్ న్యూస్. కొన్నాళ్లుగా అనుష్క పెళ్లై గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ తో అనుష్క పెళ్లి చాలాసార్లు చేశారు మీడియా వాళ్లు. ఇక లేటెస్ట్ గా సీనియర్ డైరక్ట కొడుకుతో అనుష్క పెళ్లి ఫిక్స్ అని అంటున్నారు.   

 

నిన్న మొన్నటిదాకా ఓ క్రికెటర్ తో అనుష్క పెళ్లంటూ వార్తలు రాగా ఫైనల్ గా డైరక్టర్ కొడుకుతోనే అనుష్క జీవితం పంచుకోబోతుందని అంటున్నారు. అందుకే ప్రస్తుతం నిశ్శబ్ధం తర్వాత అనుష్కసినిమా కమిట్ అవలేదు. నిశ్శబ్ధం రిలీజ్ తర్వాత అమ్మడు ఇక పెళ్లి చేసుకోవడమే అంటున్నారు. సైజ్ జీరో కోసం లావెక్కిన అనుష్క ఈమధ్య కొద్దిగా బక్క చిక్కిందని అన్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. కాని రీసెంట్ గా నాని నిర్మించిన హిట్ సినిమా ఈవెంట్ లో అనుష్క ఎప్పటిలానే కనిపించింది.   

 

బొద్దుగా ఉన్న ఆమెలో పెద్దగా మార్పులేమి రాలేదని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే భాగమతి తర్వాత అనుష్క చేసిన నిశ్శబ్ధం సినిమా కూడా రిలీజ్ కు నోచుకోవట్లేదు. సినిమా అంతా పూర్తయి రిలీజ్ కు రెడీ అయినా బిజినెస్ లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. జనవరిలోనే రిలీజ్ డేట్ ప్రకటించినా బజ్ లేకపోవడం, బిజినెస్ జరగకపోవడంతో సినిమా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడో చిత్రయూనిట్ కు కూడా తెలియని పరిస్థితి అయ్యింది. అనుష్క కూడా ఆ సినిమాపై ఆశలు వాడులుకున్నట్టే తెలుస్తుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: