టాలీవుడ్ జేజమ్మగా పేరుగాంచిన భామ అనుష్క, ఇటీవల కొన్నాళ్లుగా ఎంతో ఆచితూచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. మొదటిసారిగా నాగార్జున సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క, ఆ తరువాత నుండి మెల్లగా అక్కడక్కడా కొన్ని సినిమా అవకాశాలు అందుకున్నప్పటికీ, అవేవి కూడా ఆమెకు పెద్దగా విజయాలు అందివ్వలేదు. అయితే సరిగ్గా అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన అరుంధతి సినిమాని అనుష్క ఓకె చేయడం, ఆ వెంటనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా, రిలీజ్ తరువాత అత్యద్భుతంగా విజయాన్ని అందుకుని ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుని దూసుకెళ్లిన అనుష్క, ఆపై స్టార్ హీరోయిన్ గా పేరు గడించారు. 

 

అయితే ఇటీవల అనుష్కకు, నటుడు ప్రభాస్ తో లవ్ ఎఫైర్ ఉందని, అలానే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం అవ్వగా, మా మధ్య అదేమీ లేదంటూ వారు కొట్టి పారేశారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా అనుష్కపై పెళ్లి పుకార్లు వస్తున్నప్పటికీ ఆమె అవేవి పెద్దగా లక్ష్య పెట్టలేదు. మొన్న నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అనుష్క, ఆ వేడుకలో ఎంతో ఆనందంగా కనపడ్డారు, అయితే అదే సమయంలో ఆమె ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, తన పెళ్లి నిశ్చయం అయితే తప్పకుండా చెప్తానని, అలానే తనకు మాత్రం తన తల్లితండ్రులు చూసిన సంబంధమే చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. 

 

అయితే ఆమె చెప్పింది నిజమే అని, ఒక వారం క్రితమే టాలీవుడ్ లోని ఒక ప్రముఖ దర్శకుడి కుమారుడితో అనుష్కకు ఆమె ఇంట్లో వారు పెళ్లిని నిశ్చయించారని సమాచారం. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఆపై భార్య నుండి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆ దర్శకుడి కుమారుడితో కొద్దిరోజులుగా అనుష్క మంచి పరిచయాన్ని కలిగి ఉన్నారని, అయితే ఒకరిని మరొకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాకే పెళ్లి విషయాన్ని ప్రకటిద్దాం అని భావించి, దానిని గోప్యంగా ఉంచారని సమాచారం. ఇక నేడు ఈ వార్త బయటకు రావడం, అలానే పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో విస్తృతంగా ప్రచారం అవడం జరుగుతోంది. కాగా దీనిలో పూర్తి వాస్తవాలు మాత్రం వెల్లడి కావలసి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: