పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాలో నటితున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పవన్ క్రిష్ సినిమాకు ముహుర్తం పెట్టాడు. ఇక ఆ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో పవన్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ సినిమాలు క్యూ లైన్ లో పెట్టాడు.

 

తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సీక్వల్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా ఉంటుందో లేదో కాని లేటెస్ట్ గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో కూడా పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పవర్ స్టార్ తో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేసిన పూరి ఈసారి ఓ పర్ఫెక్ట్ స్టోరీని సిద్ధం చేశాడట. పూరి ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక పవన్ తోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.

 

ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు ఫామ్ లో లేని పూరి ఆ సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చాటాడు. అదే జోష్ తో విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీ చేస్తున్నాడు. ఫైటర్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నాడు పూరి. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడు. బాలీవుడ్ హాట్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మరి విజయ్ తో పూరి హిట్ కొడితే పవన్ మూవీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కమిటైన సినిమాలన్ని చేయాలంటే పవన్ ఏకంగా రెండేళ్లు కేటాయించాల్సి ఉంటుంది. పవర్ స్టార్ జోరు చూస్తుంటే మళ్లీ రికార్డులు సెట్ చేసేలా ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: