టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ సూపర్ హిట్ అవడంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలా కాలంగా ఫ్లాప్స్ తో గింగిరాలు తిరుగుతున్న నితిన్ కి ఒక్కసారిగా భీష్మ రూఓం లో హిట్ పడి ఫాం లోకి వచ్చేశాడు. వరుసగా మూడు ప్లాప్స్ తర్వాత వచ్చిన హిట్ సినిమా కావడంతో నితిన్ ఆ ఎంజాయ్ మెంట్ లో మునిగి తేలుతున్నాడు. ఇక వెంకీ అట్లూరితో రంగ్ దే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు తాజాగా నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు. ఒకవైపు ఈ రెండు సినిమాలతోనూ, మరో వైపు పెళ్లి పనులతోనూ బిజీగా ఉన్న నితిన్ కి అల్లు అర్జున్ విష్ తో ఎనర్జీ డబులయింది. 

 

రీసెంట్‌గా అల్లు అర్జున్.. భీష్మ హిట్ ని పెళ్లి పనులతో కలిసి ఎంజాయ్ చేయమంటూ నితిన్ ని విష్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా భీష్మ సక్సెస్ అవడంతో నితిన్ కి విషెస్ తెలియజేస్తూ నితిన్ ని కలిసి అభినందించాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నితిన్ ని అభినందించగానే నితిన్ గాల్లో తేలిపోతున్నాడు. 
ఇదిలా ఉంటే నితిన్ అంధాదున్ రీమేక్ విషయంలో సోషల్ మీడియాలో రక రకాల వార్తలొస్తున్నప్పటికీ.. నితిన్ వాటన్నిటిని ఏమాత్రం పట్టించుకోకుండా తాజా సినిమాని లాంచ్ చేసాడు. అయితే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన అంధాదున్ సినిమా కథ మొత్తం ఆయుశ్మాన్ ఖురానా తో పాటు టబు పోషించిన పాత్ర చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. అంధుడైన ప్రొఫెషనల్ పియానో ప్లేయర్ లా ఆయుశ్మాన్ ఖురానా నటించిన ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

 

ఒక క్రిమినల్ లేడీ పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు కూడా అద్భుతమైన నటనతో తన సత్తా చూపించింది. అయితే ఇక్కడ నితిన్ .. ఆయుష్మాన్ పాత్ర చేస్తున్న విషయం లో ఏమాత్రం సందేహం లేదు. కాని ఇప్పుడు టబు పాత్ర మీదే అందరిలో ఆసక్తి నెలకొంది. అంధాదున్ లో పోషించిన టబు పాత్రకి తెలుగులో కూడా టబు మాత్రమే సెట్ అవుతుంది ఆ పాత్రలో మరీ నటిని చూడాలంటే ఆసక్తి అనిపించదని కామెంట్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ప్రస్తుతం టబు పాత్ర కోసం తననే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏమిటంటే బాలీవుడ్ లో ఆయుష్మాన్ తర్వాత టబు పాత్ర ఒక్కటే హైలెట్ అయింది. అందుకే ఇక్కడ కూడా టబు ని సెలెక్ట్ చేసుకుందామని అనుకుంటున్నారట.  అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం నితిన్ సినిమాలో టబు అని అనసూయ అని వస్తున్న వార్తలన్ని గాలి వార్తలే అని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: