ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్టైన్ మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ జూలైలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా అవుట్ ఫుట్ విష‌యంలో రాజీ ప‌డ‌ని రాజ‌మౌళి ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.



దాదాపు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది.  బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆర్.ఆర్.ఆర్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ అంచ‌నాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ సినిమా కు ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయ్యిందంటున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచే ఈ ప్రాజెక్టుకు ఆర్.ఆర్.ఆర్ అని వ‌ర్కింగ్ టైటిల్ ఇచ్చారు.



గతంలో ప్రేక్షకులను ఆర్ ఆర్ ఆర్‌ కు సెట్ అయ్యే టైటిల్ సూచించమని కూడా కోరారు.   ఆ సలహాలు సూచనల సంగతి ఇప్పుడు అందరూ మర్చిపోయారు.  దీంతో అస‌లు ఆర్.ఆర్.ఆర్ అంటే ఏంటని ఎవ‌రికి వారు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి కొంద‌రు అయితే అదేదో బ‌ట్ట‌ల దుకాణం పేరులా ఉంద‌ని సెటైర్లు వేసుకుంటున్నారు. వాస్త‌వానికి రాజ‌మౌళి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చిన‌ప్ప‌టి నుంచే రాజ‌మౌళిపై సెటైర్లు వేస్తోన్న వారంతా ఇప్పుడు టైటిల్ మార్చ‌డంపై కూడా సెటైర్లు వేస్తున్నారు.



అస‌లు టైటిల్ చెప్ప‌కుండా ఇంకా ఆర్.ఆర్.ఆర్ గుట్టు దాయ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి రాజ‌మౌళి టైటిల్ విష‌యంలో లేట్ చేస్తే అది మ‌రింత మైన‌స్ కానుంది. అలా కాకుండా టైటిల్ ఎనౌన్స్ చేస్తే అది జ‌నాల్లోకి ఇప్ప‌టి నుంచే వెళ్లిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: