టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'భీష్మ'. మూడు ఫ్లాప్స్ తర్వాత ఎంతో పక్కాగా, పకడ్బంధీగా ప్లాన్ చేసుకొని నితిన్ ఈ సినిమాలో నటించాడు. అయితే అందరు వరుస ఫ్లాప్స్ తో ఉన్న నితిన్ కి మళ్ళీ మరో ఫ్లాప్ రాబోతుందని కామెంట్స్ చేశారు కూడా. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా బాగా డిలే అయింది. షూటింగ్ నెమ్మదిగా సాగింది. దాంతో చాలా మంది ఈ సినిమా మీద అపనమ్మకాన్ని వ్యకపరచారు. కానీ నితిన్ మాత్రం వీటన్నిటిని అసలు పట్టించుకోలేదు. అంతేకాదు మొదట్లో కాస్త కంగారు పడ్డ మేకర్స్ కూడా ఆ తర్వాత రష్ చూసుకొని ధీమాగా ఉన్నారు. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో బాగా హైప్ తీసుకు వచ్చింది. 

 

సాంగ్ టీజర్స్ తోను ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా బాక్స్ ఆఫీసు దగ్గర భీష్మ సత్తా చాటుతోంది.  మొదటి షో తోనే పాజిటివ్ టాక్..ఆ తర్వాత సూపర్ హిట్ అని రివ్యూస్ రావడంతో 'భీష్మ' కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి పోటీగా మరే సినిమాలు లేకపోవడం కూడా 'భీష్మ' కు  బాగా ప్లస్ అయింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.35.04 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్రేకీవెన్ మార్క్ కు చేరుకుంది. భీష్మ' థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.22.50 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ. 20.73 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. మరో రూ. 1.77 కోట్లు సాధిస్తే భీష్మ బ్రేక్ ఈవెన్ అవుతుంది. 

 

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర 'భీష్మ' జోరు చూస్తుంటే బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో రెండో మూడు వారాలు చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు కాబట్టి నితిన్ కెరీర్లో 'భీష్మ' మరో సూపర్ డూపర్ హిట్ గా నిలవనుందని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు ముందు నితిన్ సినిమాలు వరసగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే 'భీష్మ' విజయం నితిన్ కు మళ్ళీ మంచి క్రేజ్ ని మార్కెట్ ని తీసుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అంధాదున్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ పాత్ర నితిన్ కి ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి. మరి బాలీవుడ్ రీమేక్ తో నితిన్ భీష్మ సక్సస్ ని కంటిన్యూ చేస్తాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: