ఒకప్పటితో పోలిస్తే సినిమా పరిశ్రమలో ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో వల్గారిటీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో వస్తున్న సినిమాలను పరిశీలిస్తే, శృంగార సన్నివేశాలు అక్కడక్కడా తమ సినిమాల్లో ఉండేలా పలువురు దర్శకులు చూసుకుంటున్నారు. దానికి కారణం అటువంటి సన్నివేశాల వలన  కొంతవరకైనా తమ సినిమాకు పబ్లిసిటీ దక్కుతుందనేది వారి భావన అని తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ట్రెండ్ ని మెల్లగా అనుసరిస్తున్న కొందరు టాలీవుడ్ దర్శక నిర్మాతలు, తమ సినిమాల్లో కూడా ఆ విధంగా శృంగార సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు. 

 

అయితే రొమాన్స్ వేరని, శృంగారం వేరని, వాటిని రెండిటిని సమపాళ్లలో జోడించి, ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తీస్తే బాగుంటుందని, అయితే కొన్నాళ్ల నుండి మన తెలుగులో వస్తున్న అక్కడక్కడా కొన్ని సినిమాలు పరిశీలీస్తే అవి శృతిమించేలా వల్గారిటీ తో నిండి ఉంటున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే నేడు 'దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత' సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఎంతో వైరల్ అవుతోంది. ఇక ఆ ట్రైలర్ ని పరిలశీలిస్తే, ఇటీవల వచ్చిన వైఫ్ ఐ, ఏడు చేపల కథ, చీకటి గదిలో చిలక్కొట్టుడు సినిమాలను మించేలా పూర్తి స్థాయిలో శృంగార సన్నివేశాలకు దర్శకుడు నింపడం జరిగింది. 

 

అయితే ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా చాలా వరకు కూడా శృంగార సన్నివేశాల నేపథ్యంలో సాగుతుంది అనే భావన కలుగుతోందని, ట్రైలర్ లో ఏవో కొన్ని ఫైట్స్, కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా యువతని టార్గెట్ చేసి A రేటెడ్ సీన్స్ ని పెట్టినట్లు స్పష్టంగా అర్ధం అవుతోందని కొందరు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. మరి ఈ ట్రైలర్ ని చూసిన వారిలో ఎంతమంది సినిమా చూడడానికి ఆసక్తి చూపుతారో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: