లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా హీరో దగ్గుపాటి రానా.. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అయితే తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా రానా కు మంచి హిట్ ని అందించలేక పోయింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయి రికార్డులను అందుకుంది. ఆ సినిమా నటించిన రానా బాగా ఫెమస్ అయ్యాడు. 


సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న రానా.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విరాటపర్వం సినిమాలో నటిస్తున్న రానా మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రానా నటిస్తున్న సినిమా 'అరణ్య' లో నటిస్తున్నారు.అయితే  భారీకాయంతో భళ్లాలదేవ పాత్ర పోషించిన రానా.. తన తర్వాతి సినిమా అరణ్యలో అందుకు పూర్తి భిన్నంగా, బక్కపలచగా కనిపించనున్నాడు.

 

రాజమౌళి క్రియేషన్‌లో దాదాపు 110 కిలోలకు పైగా బరువు పెరిగి ఆ సినిమా తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాడు. ఆ మధ్య రానా బరువుపై పలు రకాల పుకార్లు కూడా వచ్చాయి. అయితే ‘అరణ్య’లో పాత్ర కోసమే తన శరీరాకృతి మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం బాగా వర్కవుట్లు చేసి దాదాపు 30 కిలోలకు పైగా బరువు తగ్గాడు. 

 

అసలు విషయమేంటంటే ఈ సినిమాలో రానా పాత్ర కొత్తగా ఉంటాడన్న సంగతి ఇటీవల విడుదల టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. అడవిని రక్షించే ఓ ఆదివాసిగా కనిపించనున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ‘కాడన్‌’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే రానా లుక్‌ విడుదల చేసింది. అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈరోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: