సినిమారంగం అంటే ఒక ఆయస్కాంత క్షేత్రం లాంటిది. దానికి అతుక్కున్నామా ఇక అంతే.. సినిమాల్లో నటిస్తుంటే ముందుగా డబ్బు వస్తుంది, తర్వాత పేరు, ప్రఖ్యాతలు వస్తాయి.. కాని ఇంకోటి కూడా వస్తుంది.. అదేమంటే కొన్ని కొన్ని చిత్రాల్లో చేసే క్యారెక్టర్స్ వల్ల బయట జనంలో చెడ్దపేరు వస్తుంది. ఇలాంటి పరిస్దితులను ఎందరో నటీ నటులు ఎదుర్కొన్నారు.. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్ వేసే వారి విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది..

 

 

ఇకపోతే టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తనకంటు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్.. ఈయన గొంతుకు దాసోహం కాని వారు ఎవరుండరు.. భయంకరమైన డైలాగులను అయినా కరుణతో కూడిన డైలాగ్స్ అయినా ఈయన నోటినుండి వస్తే నేరుగా హృదయంలోకి వెళ్లి కూర్చుంటాయి.. ఇక సాయికుమార్ తమ్ముడు రవి శంకర్. ఆయన చేసిన సినిమాలు ఎవ్వరికీ గుర్తు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ.. కానీ ఆయన వాయిస్‌ని మాత్రం ఎవరు మర్చిపోలేరు.

 

 

ముఖ్యంగా ‘అరుంధతి’ సినిమాలో ‘బొమ్మాలీ నిన్ను వదలా..’ అంటూ ఆడియన్స్ గుండెలు అదిరిపోయేలా డబ్బింగ్ చెప్పి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇక రవి శంకర్ ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ‘అలీతో సరదాగా’ షోకు గెస్ట్‌గా హాజరైన సందర్భంగా తనకు ఎదురైన షాకింగ్ అనుభవాలను బయటపెట్టారు. అరుంధతి సినిమాకు ముందు నన్ను అంతా సాయి రవి కుమార్ అని పిలిచేవారు. కానీ ‘అరుంధతి’ తర్వాత అందరూ నన్ను ‘బొమ్మాళీ’ రవి శంకర్ అని పిలవడం మొదలుపెట్టారు.

 

 

ఇదే సందర్భంలో ఓసారి నేను నా భార్యతో కలిసి సినిమా చూడటానికి వెళ్లాను. సినిమా అయిపోయాక ఆడియన్స్‌తో పాటే మేము బయటికి వెళుతుంటే కొందరు లేడీస్ మా దగ్గరికి వచ్చి ‘ఇలాంటివాడితో ఎలా సంసారం చేస్తున్నావమ్మా’ అని నా భార్యతో అన్నారు. దాంతో నేను షాకైపోయాను. కానీ గర్వంగా అనిపించింది.. ఎందుకంటే నేను నటించిన ఆ సినిమాలోని క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారనే విషయం వీరి మాటల్లో తెలుస్తుంది అని అన్నారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: