సినిమా రంగంలో అదృష్టం. ఏది ఒకరి వల్ల రాదు ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. బలమైన సినిమా వారసత్వం, రాజకీయ వారసత్వం ఉన్నా ఇక్క‌డ నిల‌దొక్కుకోలేని ఎంతో మంది ఉన్నారు. అంత ఎందుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుటుంబం నుంచి హీరోలుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ 15 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే సుదీర్ఘమైన చరిత్ర ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన ఒక హీరోను ఒక రేంజ్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఆ హీరో కెరీర్లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దూసుకుపోతున్న టైంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైం లో ఎన్టీఆర్ కు పోటీగా చంద్రబాబు పనిగట్టుకుని తారకరత్న హీరోగా పరిచయం చేశారు. పైగా ఒకే రోజు ఏకంగా 11 సినిమాలతో చంద్రబాబు చేతుల మీదగా తారకరత్న హీరోగా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ కు పోటీగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తారకరత్న సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు రిలీజ్ అయింది. 

 

సినిమా అంచనాలు అందుకోలేక పోయిన ఒక మాదిరి గా పర్వాలేదనిపించింది. అప్పటి నుంచి తారకరత్న నటించిన సినిమాలు అన్నీ ఘోరంగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. తారకరత్న రెండో సినిమా యువరత్న అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక మూడో ప్రయత్నంలో తారకరత్న తారక్ పేరు తో తీసిన సినిమా సైతం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరమైన తారకరత్న సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వంలో భద్రాద్రి రాముడు సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తారకరత్న రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు. మధ్యలో 1, 2  చిత్రాల్లో నటించినా కూడా తారకరత్న హీరోగా మాత్రం క్లిక్ అవ్వలేదు.

 

ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా చంద్రబాబు నాయుడు దింపిన తారకరత్న హీరోగా నిలదొక్కుకోలేక సరికదా చంద్రబాబు పరువు కూడా తీసేసాడు అని చెప్పాలి. సినిమాల్లో రాణించడానికి వారసత్వం ఉంటే సరిపోదు టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేనివాడు హీరో కాదు జీరో అన్నది తారకరత్న విషయంలో  ఖ‌రారు అయిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: