రాజకీయాల్లో రాణించాలంటే తాత తండ్రులు, రాజకీయ నాయకులు అయినంత మాత్రాన సరిపోదు టాలెంట్ ఉండాలి. అంత బలమైన వారసత్వం లేకపోతే ఏం జరుగుతుందో చంద్రబాబు తనయుడు లోకేష్ విషయంలోనే చూశాం. అదే టాలెంట్ ఉంటే రాజకీయ వారసత్వం అక్కర్లేదని ఏపీ సీఎం జగన్ తెలంగాణ మంత్రి కేటీఆర్ నిరూపించి చూపించారు. ఇక ఇదే సూత్రం వర్తిస్తుంది. చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. అదే మోహన్‌బాబులాంటి సీనియర్ నటుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా మంచు విష్ణు మంచు మనోజ్ సరైన హిట్ లేక కెరీర్ పరంగా పూర్తి డైలమాలో ఉన్నారు. అంతెందుకు అక్కినేని నాగార్జున నట వారసుడిగా ఎంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సైతం వరుస ఫ్లాపులతో విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే.

 

తాత, మేనమామ స్టార్ హీరోలుగా తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన అటు తండ్రి నిర్మాతగా ఉన్నా హీరోగా రాణించలేకపోయాడు. అక్కినేని మనవడు అక్కినేని సుమంత్. తాత అక్కినేని నాగేశ్వర రావు, మేనమామ టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున లాంటి బలమైన హీరోలు అండగా ఉన్నా సమంత మాత్రం హీరోగా ఎదుర్కోలేక పోయాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమా తో పరిచయం అయిన సుమంత్ మధ్యలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సంబంధం సినిమా లో కూడా నటించాడు.

 

మధ్యలో సత్యం సినిమా తో పాటు మహానంది ఇలాంటి ఒకటి అర సినిమాలతో కాస్త పేరు రావడం మినహా సుమంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. చివరకు మేనమామ నాగార్జునతో కలిసి నటించిన స్నేహమంటే ఇదేరా సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సుమంత్ వైవాహిక జీవితం కూడా విఫలమైంది. అప్పటి స్టార్ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న సుమంత్ ఏడాదిన్నరకే ఆమెతో విభేదాలు రావడంతో వారిద్దరు విడిపోవాల్సి వచ్చింది. కీర్తి రెడ్డి మరో పెళ్లి చేసుకుని ఫారిన్ లో సెటిల్ అయితే సమంత మాత్రం ఇంకా ఒక్క హిట్ కోసం దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: