టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ చాలా తక్కువ టైమ్ లోనే దర్శకుడిగా పాపులర్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ తరం టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసి సూపర్ హిట్ ఇచ్చాడు. మహేష్ బాబు పోకిరి జూనియర్ ఎన్టీఆర్ టెంపర్, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో సినిమాలు చేసి హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా చిరుత సినిమాను సైతం డైరెక్ట్ చేశారు.

 

టాలీవుడ్లో ఈ తరం జనరేషన్ హీరో లో టాప్ హీరోగా ఉన్న అందరు హీరోలతోనూ సినిమాలు చేసిన పూరి సీనియర్ హీరోలు అయిన నాగార్జున తో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. అలాగే యువరత్న బాలకృష్ణతో పైసా వసూల్ సినిమా చేసిన పూరి ఆ సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఘనత సొంతం చేసుకున్నారు. ఇలా ఎలా సార్ హీరోల నుంచి సీనియర్ హీరోలు తాజాగా విజయ్ దేవరకొండ లాంటి జూనియర్ హీరోలతో సైతం సినిమాలు తీస్తున్న పూరి మధ్యలో కెరీర్ ప‌రంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. టెంపర్ సినిమా తర్వాత వరుసగా ఆరు డిజాస్టర్ లు ఇచ్చిన పూరి ఎట్టకేలకు రామ్ హీరోగా తెరకెక్కిన ఈ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చారు.

 

ఎంతో మంది హీరోల కెరీర్ ను మార్చిన పూరి. తన తమ్ముడు సాయిరాం శంకర్ కెరీర్ ను మాత్రం మార్చలేక పోయాడు. సాయిరామ్ శంకర్ హీరోగా నిలబెట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మీ ఫలించలేదు. తొలుత సాయిరాం శంకర్ తో 143 సినిమా తీసిన పూరి అది అట్టర్ ఫ్లాప్ అవడంతో తర్వాత బంపర్ ఆఫర్ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడిన  సాయిరాం శంకర్ మాత్రం తన కెరీర్‌ను కంటిన్యూ చేసుకోలేకపోయాడు. ఏదేమైనా టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ లాంటి అన్న ఉండి కూడా సాయిరాం శంకర్ హీరోగా నిలదొక్కుకోలేక పోవటం బాధాకరమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: