సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చులకన భావం జనాలకి ఉన్న సంగతి తెలిసిందే. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీలో కులం పిచ్చి ఉంటుందని, బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండస్ట్రీ అని..కొత్త వాళ్ళు వస్తే రానివ్వకుండా తొక్కేస్తారని .. తెలుగమ్మాయిలని ఎంకరేజ్ చేయరని .. సక్సస్ వెంటే అందరూ ఉంటారు తప్ప ఒక్క ఫ్లాప్ వస్తే బిచ్చగాడి కంటే హీనంగా చూస్తారని ఇలా చెప్పుకుంటే చిన్న సినిమానే తీసేయొచ్చు ఇండస్ట్రీలో జరిగే విషయాల మీద. ఇక హీరోయిన్స్ విషయంలోను ఎపుడూ ఏదో ఒక హాట్ టాపిక్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక వర్గం జనాలైతే సినిమా హీరోయిన్ అంటే అదేదో దెయ్యాలని చూసినట్టు చూస్తారు. మనుషుల కింద లెక్క పెట్టరు. తప్పు చేసిన తీవ్రవాదిలా చూస్తుంటారు.

 

అయితే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం చాలా కష్ఠమైన పని. అంత సులభంగా హీరోయిన్ ఛాన్స్ రాదు. వచ్చినా దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా భరించాలి. టెన్షన్స్ అనుభవించాలి. సినిమా హిట్ .. హీరోయిన్ బాగా చేసింది ..అనే మాట కంటే లక్కీ హీరోయిన్ అన్న మాటే ఇక్కడ ఇంపార్టెంట్. ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు గనక బాగా సక్సస్ అయితే ఇక ఆ హీరోయిన్ ని నెత్తి మీద పెట్టుకుంటారు. లేదు ఒకవేళ ఒక్క సినిమా ఫ్లాపయినా హీరోయిన్ ని పక్కన పడేస్తారు. ఫ్లాపయిన అదే సినిమాలో హీరో తో మాత్రం మళ్ళీ సినిమాలు చేస్తారు.

 

అయితే ఇక్కడ హీరోయిన్ గా సక్సస్ అవ్వాలంటే కమిట్‌మెంట్  తప్పనిసరి అంటూ ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు, దర్శకులు నీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే మాకేంటి అని డైరెక్ట్ గానే అడుగుతున్నారని వాపోతున్నారు. గత కొంతకాలంగా ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు తాజాగా ఒక సింగర్ సంచలన వ్యాఖ్యలు చేశారట. సినిమాలో ఒక్క పాట పాడటానికి అవకాశం ఇచ్చి సదురు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ స్సింగర్ ని ఆ మాట అడిగేశాడట. 

 

నీకు పెద్ద సినిమాలో పాడే ఛాన్స్ ఇస్తున్నా కదా మరి నాకు కూడా నువ్వు ఛాన్స్ ఇవ్వాలని నీకు ఇంకా పెద్ద సినిమాలలో పాటలు పాడే ఛాన్స్ ఇస్తానని డైరెక్ట్ గా చెప్పాడట. ఈ మాటకి ఆ సింగర్ ఛీ కొట్టి నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయితే కావచ్చు. నువ్వు ఇచ్చే ఒక్క పాట వల్ల నా జీవితం ఏమీ మారిపోదు అంటూ వెళ్ళిపోయిందట. మరి ఆ ఫేమస్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అర్థమైందా ..?  

మరింత సమాచారం తెలుసుకోండి: