టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అతి తక్కువ కాలంలో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియాలో తన మార్కెట్ విస్తరింప చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అతి తక్కువ బడ్జెట్ లో గీతా గోవిందం సినిమా చేసి భారీ లాభాలు సాధించాడు. దీంతో వరుసపెట్టి సినిమా ఆఫర్లు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఇటీవల సినిమా హిట్ కొడతా కి నానా తంటాలు పడే స్థాయికి దిగజారిపోయారు. చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ Troll స్టార్ట్ చేయడంతో తన సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా హడావిడి చేయడం తగ్గించేశారు.

 

రీసెంట్ గా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేదు. భారీ అంచనాల మధ్య ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తారీఖున విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను సరిగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొత్తం మీద విజయ్ నటన మాత్రం బాగుంది అన్న టాక్ ప్రేక్షకుల నుండి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క సినిమాలు ఫెయిల్ అవుతున్న మరో పక్క మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ.

 

విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా ఆరు మిలియన్లకు చేరుకుంది. అయితే ఈ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ విజయ్ దేవరకొండ కావడం విశేషం. అయితే ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను కూడా వెనక్కి నెట్టి వేయడం జరిగింది. దీన్ని బట్టి చెప్పవచ్చు విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందనేది. ఒక పక్క సినిమాలు ఫెయిల్ అవుతున్న మరో పక్క వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: