టాలీవుడ్ సీనియర్ హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇద్దరూ కూడా రెండవ తరంలో అగ్రనటులుగా కొన్నేళ్ల పాటు టాలీవుడ్ చిత్రసీమను ఏలారు. ముందుగా తేనెమనసులు సినిమాతో కృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వగా, చిలకా గోరింకా సినిమాతో కృషంరాజు నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇద్దరు నటులు కలిసి ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది. కాగా వాటిలో దాదాపుగా చాలావరకు మంచి సక్సెస్ ని అందుకున్నవే. ఇక బయట కూడా ఈ ఇద్దరు నటులు ఎన్నో ఏళ్ల నుండి మంచి స్నేహితులు కూడా. ఇక ఎప్పటికప్పుడు ఒకరి ఇంటికి మరొకరు ఎక్కువగా వెళ్తూ ఉండే కృష్ణ, కృష్ణంరాజుల స్నేహం చూసిన కొందరు సినిమా నటులు అయితే, వారిద్దరినీ మంచి అన్నదమ్ములుగా భావించేవారట. అయితే వారి స్నేహం అనంతరం వారి తనయులైన మహేష్, ప్రభాస్ లకు కూడా దానిని కొనసాగిస్తున్నారు. 

 

ప్రభాస్ తో మంచి అనుబంధం ఉన్న మహేష్ బాబు, ఆయన హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అయిన ఈశ్వర్ సినిమా సక్సెస్ వేడుకకు, అలానే వర్షం సినిమా సమయంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసి యూనిట్ ని అభినందించారు. ఇక ఒక్కడు సినిమా సమయంలో కూడా ప్రభాస్ ఆ వేడుకకు విచ్చేసి మహేష్ కు అభినందనలు తెలిపారు. అది మాత్రమే కాక ఈ ఇద్దరూ కూడా పలు సందర్భాల్లో కలిసి మెలిసి మీడియాకు కనిపించడం జరిగింది. ఇక ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

 

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన వారితో పాటు ఎందరో రాజకీయ  ప్రముఖులు సైతం విచ్చేసిన ఈ వేడుకకు కృష్ణ కూడా ప్రత్యేకంగా విచ్చేసారు. 
అయితే కృష్ణ ఈ వేడుకకు విచ్చేసిన సమయంలో ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరూ కూడా ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి ఆయనతో కలిసి సరదాగా ముచ్చటించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆ వేడుక తాలూకు ఫోటోలు నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండడంతో, పలువురు నెటిజన్లు కృష్ణ, కృష్ణంరాజు, ప్రభాస్ కలిసిన దిగిన ఫోటోపై, ఇటీవలి కాలంలోని ది బెస్ట్ ఫోటో ఇదేనేహే అంటూ దానికి క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: