తనువెళ్లా గాయాలైతే నెమలి పురివిప్పి ఆడుతుందా.. మనసంతా ఆందోళన నిండిపోతే.. గానం పల్లవిస్తుందా.. తానూ అంతే అంటోంది ఓ గాయని.. తన జీవితంలో జరిగిన ఘోర పైశాచిక ఘటనను చాలా రోజుల తర్వాత బయటపెట్టింది ప్రముఖ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత డఫీ. కొంత కాలంగా డఫీ సరిగ్గా పాడటం లేదు. సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

 

ఈ విషయంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇన్నాళ్లూ ఈ విమర్శను భరించిన డఫీ.. తాజాగా అసలు విషయం బయటపెట్టారు. తాను పాడలేకపోవడానికి గల కారణాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అసలేం జరిగిందేటే.. కొంతకాలం క్రితం తనను కొందరు ఘోరంగా అత్యాచారం చేశారట. తనకు డ్రగ్స్ ఇచ్చి తాను మత్తులో ఉండగా ఘోరంగా రేప్ చేశారట.

 

IHG

 

ఇటీవల చాలాకాలంగా సంగీతానికి దూరంగా ఉండడానికి కారణం తాను అత్యాచారానికి గురి కావడమేనని డఫీ చెబుతోంది. మాదకద్రవ్యాలు ఇచ్చి కొంతకాలంపాటు తనను బందీగా ఉంచి ఈ ఘోరానికి పాల్పడ్డారని డఫీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘోరం నుంచి కోలుకోవడానికి చాలాకాలం పట్టిందని తన ప్రకటనలో తెలిపింది. గుండెను చిదిమేసిన ఆ బాధను అనుభవిస్తూ ఎలా పాడగలనని డఫీ ప్రశ్నించింది.

 

అయితే ఈ అత్యాచారం తాజా జరిగింది కాదు. ఇది జరిగి కొన్నేళ్లవుతోంది. మరి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తే... దానికి తన సమాధానం.. తన బాధను తన కళ్లతో ప్రపంచానికి చూపడం ఇష్టం లేకనే అంటోదీ డఫీ. ఇప్పుడు కూడా చెప్పడం సరైనది అవునో, కాదో చెప్పలేనని, కానీ ఇది మాత్రం నిజమని, ప్రస్తుతం బాగానే ఉన్నానని డఫీ తన గురించి తెలిపింది. దశాబ్దకాలంగా తన జీవితంలో అలముకున్న చీకట్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానని, వెలుగులు కనిపిస్తున్నాయని డఫీ చెబుతోంది. ఏదేమైనా ఇలా తన అనుభవాన్ని నిజాయితీగా అభిమానులతో పంచుకున్న డఫీని అభినందించాల్సిందే. ఆమె ఎప్పటిలాగానే సంగీత ప్రపంచాన్ని ఊర్రూతలూగించాలని కోరుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: