అదేంటి శేఖర్ కమ్ముల రాసింది భానుమతి కదా మరి దాన్ని భాను శ్రీ అని ఎందుకు మార్చామనేగా మీ డౌట్. షార్ట్ ఫిలిమ్స్ తో క్రేజ్ తెచ్చుకుంది. టివి యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న భాను శ్రీ స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 2లో ప్రేక్షకులకు దగ్గరైంది. అమ్మడు ఉన్న నాలుగైదు వారాలు షోలో బాగానే ఎంటర్టైన్ చేసింది. ఇక ఆ ఐడెంటిటీతో మంచి అవకాశాలే అందుకుంటుంది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ భాను తను ఏం చేసినా సరే డేరింగ్ గా చేస్తుంది.  

 

టెంప్ట్ రవి ఏడుచేపల కథలో నటించింది అంటే అమ్మడు గట్స్ గురించి అర్ధం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా తన అందాల ప్రదర్శనతో మరోసారి హాట్ న్యూస్ గా మారింది భాను. లో దుస్తులు కనిపించేలా.. స్కట్ వేసుకుని ఉన్న అమ్మడి పిక్ ఒకటి ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ పిక్ చూస్తే తెలుగు అమ్మాయిలు రెచ్చిపోతే ఇలా ఉంటుందా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. భాను శ్రీ తను ఏం చేయాలనుకున్నా సరే ఎవరి సలహాలు సూచనలు పాటించదు జస్ట్ అలా చేసేస్తుంది.

 

హాట్ ఫోటోని షేర్ చేయడమే కాదు అమ్మాయి అంటే స్ట్రాంగ్ గా గట్సీగా ఉండాలని.. ఏం చేయడానికి వెనకడుగు వేయకూడు.. భయం అన్నది లేకుండా.. ధైర్యంగా.. ఇండిపెండెంట్ గా ఉండాలని.. అసలు మగవాడి అవసరమే లేకుండా జీవించాలని అంటుంది. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండే అమ్మాయిలా ఉండాలి.. గర్ల్ పవర్ ఏంటో చూపించాలని పెద్ద కొటేషనే పెట్టింది. గర్ల్ పవర్ చూపించాలి అని ఇలా విప్పుకుని చూపిస్తే ఎలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా భాను ఈ బోల్డ్ అటెంప్ట్ చూసి ఆమె బుల్లితెర ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: