ఆరెక్స్ 100 సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటుంది. అయితే తనకు వచ్చిన ఈ బోల్డ్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్న ఈ అమ్మడు ఓ పక్క తన బోయ్ ఫ్రెండ్ తో లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆరెక్స్ 100, ఆర్డిఎక్స్ లవ్ సినిమాల్లో తన హాట్ అందాలతో కుర్రాళ్లను డిస్ట్రబ్ చేసిన పాయల్ రాజ్ పుత్.. ప్రేక్షకులంతా ఆమె అంటే పడిచస్తుంటే ఆమె మాత్రం ఒక మోడల్ కు పడిపోయింది.     

 

మోడలింగ్ చేస్తున్న టైంలో సౌరవ్ డింగ్రాతో పరిచయం స్నేహంగా మారిందట. ఆ స్నేహం కాస్త ప్రేమ అయ్యింది. ఇన్నాళ్లు సీక్రెట్ గా ఉంచిన పాయల్ ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టింది. తనకు పెరుగుతున్న ఫాలోయింగ్.. ప్రపోజ్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది కాబోలు.. తను ఆల్రెడీ కమిటెడ్ అన్న విషయాన్ని చెప్పింది పాయల్. సౌరవ్ డింగ్రా పుట్టినరోజు సందర్భంగా అతను మీద తన ప్రేమను చూపించింది పాయల్. అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ మీద పడి మరి ముద్దులు పెడుతుంది.

 

తన బోయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ అమ్మడు చెప్పకనే చెప్పింది. ఇన్ని కోట్ల మంది హృదయాలను గెలిచిన ఈ అందాల ముద్దుగుమ్మ మనసు గెలిచిన అతని చూసి చాలామంది లక్కీ ఫెల్లో అని సౌరవ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక పాయల్ సినిమాల విషయానికొస్తే డిసెంబర్ లో వచ్చిన వెంకీమామ హిట్ అవగా ఈ ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన రవితేజ డిస్కో రాజాతో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: