సినీ రంగం సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. నటీనటులైనా, సాంకేతిక నిపుణులైనా ఇండస్ట్రీలో కొనసాగాలంటే సక్సెస్‌ మాత్రం కంపల్సరీ. సక్సెస్‌ రాలేదంటే ఎంత పెద్ద స్టార్‌ అయినా పక్కన పెట్టేస్తారు. అందుకే స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన కథానాయుకులు కూడా సక్సెస్‌ వేటలో వెనకపడి ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో లవర్‌ బాయ్‌ తరుణ్‌. బాలనటుడిగా ఇండస్ట్రీకి పరచియం అయిన తరువాత హీరోగా తొలి ప్రయత్నంలోనే సూపర్‌ హిట్‌ కొట్టాడు. తరుణ్ తల్లి కూడా బాల నటి కావటంతో ఇండస్ట్రీలో చాలా పరిచయాలే ఉన్నాయి. దీంతో అవకాశాలను కూడా బాగానే అందుకున్నాడు. అయితే కెరీర్‌ స్టార్టింగ్‌లో సక్సెస్‌ అవుతున్నట్టుగానే కనిపించినా తరువాత తరువాత గాడి తప్పాడు. పూర్తిగా ఫాం కోల్పోయి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఒకప్పుడు లవర్‌ బాయ్ గా ఎందుగుతాడనుకున్న హీరో కాస్త ఎటూ కాకుండా పోయాడు.

 

భారీ ఫిలిం బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న హీరోలకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మెగా హీరో అన్న ట్యాగ్ స్టార్ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ వారసత్వం, టాప్ హీరో అల్లు అర్జున్‌ తమ్ముడిగా రెడిమేడ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్‌. ఎంతో మంది నటీనటులకు లైఫ్‌ ఇచ్చిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్స్‌ శిరీష్‌ను హీరోగా నిలబెట్టడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి.

 

భారీ ఫిలిం బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండి కూడా హీరోగా సక్సెస్‌ కాలేకపోయిన మరో హీరో మంచు మనోజ్‌. దొంగ దొంగది లాంటి హిట్‌ సినిమాతో హీరోగా పరిచయం అయిన మంచు మనోజ్‌ కూడా బాలనటుడే. మోహన్‌ బాబు లాంటి భారీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న మనోజ్‌ హీరోగా కెరీర్ కొనసాగించటంలో ఫెయిల్ అయ్యాడు. కథల ఎంపికలో చేసిన పోరపాట్లు, వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఇబ్బందుల కారణంగా మనోజ్‌ కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. దీంతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న మనోజ్‌ త్వరలో ఓ భారీ చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: