తెలుగు సినిమా రంగంలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కు గొప్ప చరిత్ర ఉంది. దివంగత మహానటుడు ఏఎన్నార్ నుంచి ఆయన తనయుడు అక్కినేని నాగార్జున యువరత్న నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల వరకు ఎన్నో సూపర్‌డూపర్ హిట్ సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు చాలా వైవిధ్యంగా కొనసాగింది. 1990వ దశకంలో జగపతి బాబు పేరు చెబితే ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరో గా ప్రసిద్ధి చెందాడు. 

 

1980వ దశకంలో సోగ్గాడు శోభన్ బాబుకు ఎలా ఉండేదో 1990వ దశకంలో జగపతి బాబు సైతం అలాంటి క్రేజ్ ఉండేది. శుభలగ్నం, మావి చిగురు, ఆమె, సముద్రం, మనోహరం ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో జగపతి బాబు నటించి మెప్పించాడు. 2012 వరకు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన జగపతి బాబు తాను హీరోగా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో సినిమాలకు కాస్త విరామం ప్రకటించేశాడు. అసలు సినిమాకే కొనసాగించాలా వద్దా అన్న డైలమాలో పడిపోయాడు. అదే టైంలో జగపతిబాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా బాలయ్య లెజెండ్  సినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీను జగపతిబాబును ఒప్పించి మరీ నటింప చేశాడు.

 

 లెజెండ్ సినిమాలో హీరో బాలయ్య కు దీటైన విలన్ క్యారెక్టర్ లో నటించిన జగపతిబాబు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వ‌డంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా విన్నర్ మహేష్ బాబు శ్రీమంతుడు, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, అర‌వింద‌స‌మేత‌ రామ్‌చ‌ర‌ణ్‌ రంగస్థలం సినిమా లో హీరో తండ్రి క్యారెక్టర్ లేదా విలన్ క్యారెక్టర్ ల‌లో తన వీరోచితమైన నటనతో రెండో ఇన్నింగ్స్ లో తెలుగు ప్రేక్షకుల మదిని దోచే చేశాడు. ఇక విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ అన్నీ స‌క్సెస్‌లు కొడుతూ మ‌ళ్ళీ హీరోగా నిలిచాడ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: