గతంలో పవన్ కళ్యాణ్ కు కథ చెప్పాలని ఎవరైనా దర్శకుడు ప్రయత్నిస్తే అతడు పవన్ కు అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ ద్వారా మాత్రమే పవన్ కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యే వారు. ప్రస్తుతం పవన్ తో ‘పింక్’ రీమేక్ చేస్తున్న దిల్ రాజ్ ను కూడ త్రివిక్రమ్మూవీ రీమేక్ విషయమై స్వయంగా త్రివిక్రమ్ సహాయతో పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళినట్లు గతంలో వార్తలు వచ్చాయి.


అయితే ఇప్పుడు దిల్ రాజ్ పవన్ కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యాక పవన్ దిల్ రాజ్ కు బాగా సన్నిహితం అవ్వడమే కాకుండా దిల్ రాజ్ రికమెండ్ చేస్తే చాలు పవన్రచయిత లేదా ఏ దర్శకుడు చెప్పే కథలను వినడానికి వెంటనే ఒకే చేపుతున్నాడని టాక్. దీనితో ఇప్పుడు ఏ రచయిత అయినా లేదంటే దర్శకుడు అయినా హ్యాపీగా పవన్ దగ్గరకు వెళుతున్నారని దిల్ రాజ్ మూలంగా ప్రస్తుతం పవన్ ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  


అంతేకాదు దిల్ రాజ్ పవన్ తో వచ్చే సంవత్సరం మరొక సినిమాను చేసే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రస్తుతం త్రివిక్రమ్ ఎలాగు ఇప్పట్లో పవన్ తో సినిమా చేసేది లేదు కనుక అతడిని రెగ్యులర్ గా కలవడం లేదని దీనితో  దిల్ రాజు పూర్తిగా పవన్ దగ్గర ప్లేస్ సొంతం చేసేసుకున్నాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 


వాస్తవానికి దిల్ రాజ్ ఎటువంటి హీరోని అయినా తన మాటల గారడీ తో బుట్టలో పడేస్తాడు అని అంటారు. అందువల్లనే టాప్ హీరోలు అందరు దిల్ రాజ్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. దీనికి తగ్గట్లుగా దిల్ రాజ్ కూడ హీరోలు అడిగే భారీ పారితోషికాల విషయంలో ఎటువంటి అబ్యంతరాలు చెప్పడు. ఇప్పుడు దిల్ రాజ్ పవన్ కు ఇలా బాగా సన్నిహితం అవ్వడానికి గల కారణం ‘పింక్’ రీమేక్ విషయంలో దిల్ రాజ్ పవన్ కు ఆఫర్ చేసిన 50 కోట్ల పారితోషికం పవన్ దిల్ రాజ్ లను బాగా దగ్గర చేసి ఉంటుంది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: