తెలుగు సినీరంగంలో కొన్ని సెంటిమెంట్లను చాలా గట్టిగా ఫాలో అవుతుంటారు. అలాంటి ఓ అరుదైన సెంటిమెంటే లవర్ బాయ్‌ ఇమేజ్‌. ఇండస్ట్రీలో లవర్ బాయ్‌ ఇమేజ్‌ వచ్చిన చాలా మంది హీరోలు వెంటనే తెరమరుగైపోయారు. లవ్‌ స్టోరీస్‌ చేసినా మాస్‌ హీరో ట్యాగ్‌ కూడా ఉంటేనే తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అలా కేవలం లవర్‌ బాయ్‌ అన్న ఇమేజ్‌కే పరిమితమై నష్టపోయినా హీరోల లిస్ట్‌ కూడా పెద్దదే.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో ఉదయ్‌ కిరణ్‌. వెండితెర మీద ఉదయ్‌ కిరణ్‌ ప్రయాణం చాలా మంది హీరోలకు ఓ గుణపాఠం లాంటిది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు ఉదయ్‌ కిరణ్‌. ఆ తరువాత నువ్వు నేను సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మరిపోయాడు. మనసంతా నువ్వే సినిమా ఉదయ్‌ ఇమేజ్‌ను తారా స్థాయికి చేర్చింది. ఇలా వరుస విజయాలతో లవర్‌ బాయ్‌గా ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. అయితే ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడు ఉదయ్‌ కిరణ్‌. ఒక ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోవటంతో మాస్‌ హీరోగా ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో వరుస ఫెయిల్యూర్స్‌ ఉదయ్‌ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.

 

మరో యంగ్ హీరో తరుణ్ పరిస్థితి కూడా ఇదే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తరుణ్‌, నువ్వే కావాలి సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్నాడు. తరువాత నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే పూర్తిగా లవ్‌ స్టోరిలకే పరిమితం కావటంతో తరుణ్‌ కెరీర్‌ కూడా అర్థాంతరంగా ముగిసిపోయింది.

 

మరో యంగ్ హీరో వరుణ్ సందేశ్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన వరుణ్‌, తరువాత ఒకటి రెండు సక్సెస్‌లు చూసినా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో లవర్‌ బాయ్ ఇమేజ్‌ వచ్చినట్టుగానే వచ్చి పూర్తిగా కెరీర్‌ ముగిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: