ఆయన తెలుగు సినిమాకు ఓ దార్శనికుడు.. తెలుగు సినిమాకు దిక్సూచి.. తెలుగు సినిమాకు పెద్ద.. నిన్నటి తరంలో దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటి తరంలో మంచు విష్ణు వరకు ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసిన ఘనమైన చరిత్ర ఆయనది. తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా భవిష్యత్తులో ఎవరు చేరుకోని విధంగా ఏకంగా 151 సినిమాలకు రికార్డు స్థాయిలో దర్శకత్వం వహించిన ఘనమైన చరిత్ర ఉన్న దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు సినిమా రంగంలో కొన్ని పేజీలు అలా ప‌దిల‌మైపోయాయి.

 

దాసరి నారాయణరావు జీవించి ఉన్నన్ని రోజులు తెలుగు సినిమా రంగాన్ని ఎలా శాసించారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సినిమా రంగాన్నే కాకుండా ఉదయం పేపర్‌తో పత్రికా రంగంలోనూ ఎన్నో సంచలనాలు క్రియేట్ చేయడం ఆయనకే సాధ్యమైంది. రాజ్యసభ సభ్యుడిగా కేంద్రమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉన్నన్ని రోజులు దాసరి సంపాదించిన ఆస్తుల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దాసరి నారాయణరావు  జీవితంలో కూడా లేని లోటు ఒకటి మాత్రం ఉండిపోయింది. అదే ఆయన తనయుడు దాసరి అరుణ్ కుమార్‌ను స్టార్ హీరోగా నిలబెట్టాలని దాసరి ఎన్నో ప్రయత్నాలు చేశారు. గ్రీకు వీరుడు లాంటి సినిమా తెరకెక్కించిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అరుణ్ కుమార్ హీరోగా చూడాలన్నదే దాసరి కోరిక. 

 

ఆ తర్వాత దాసరి అరుణ్ కుమార్ కొన్ని యాక్షన్ సినిమాలలో నటించిన అవి క్లిక్ కాలేదు. దీంతో అరుణ్ కుమార్ హీరోగా తన ప్రయత్నాలు విరమించుకుని చివరకు రంగంలో సెటిల్ అయిపోయాడు. ఏదేమైనా ఎంతో మందిని హీరోగా నిలబెట్టిన దాసరి తన కొడుకును మాత్రం హీరోగా నిలబెట్టుకోలేక పోవటం విచిత్రమే అని చెప్పాలి. ఇక అలాగే దాస‌రి అరుణ్‌కుమార్ త‌ర్వాత త‌న పెళ్ళి విష‌యంలో కూడా తండ్రి మాట విన‌లేద‌ని ఆయ‌న‌కు న‌చ్చిన అమ్మాయిని చేసుకున్నార‌ని ఆ సంఘ‌ట‌న‌తోనే దాస‌రి స‌గం కుమిలిపోయార‌ని అంద‌రూ అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: