ఉదయ్ కిరణ్ వచ్చీ రావడంతోనే వెండితెరకి ఓ కొత్త మెరుపునిచ్చిన యువకిరణంగా మారిపోయాడు... అని చెప్పవచ్చు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఉదయ్.. ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘చిత్రం’తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టగా.. తొలి సినిమాతోనే ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఆ వెంటనే అవకాశాలు వరుసకట్టాయి. విజయాలు వెంటపడ్డాయి. ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో హ్యాట్రిక్‌ హీరో అనిపించుకొన్నారు. మూడు విజయాలతో దిష్టి తగిలిందో ఏమో ఆ తర్వాత పరాజయాలు పలకరించాయి. ఆయన కెరీర్‌లో ‘నీ స్నేహం’ చివరి విజయమైంది..

 

 

980 జూన్‌ 26న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన సికింద్రాబాద్‌ వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇకపోతే వరుస హిట్లతో అభిమానుల్లో మంచి క్రేజ్ సాధిస్తున్న తరుణంలో మెగాస్టార్ అల్లుడిగా ఇక అతనికి తిరుగులేదనుకున్నారు. అల్లు రామలింగయ్య రూపంలో చిరంజీవికి అదృష్టం కలిసి వచ్చినట్టు చిరంజీవితో ఉదయకిరణ్ దశ తిరుగుతుంది అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు.. వివాహం కాలేదు. తరువాత సినిమాల్లో అవకాశాలూ లేకుండా పోయాయి. వృత్తిలో ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తాడు అనుకున్న హీరో కాస్తా అవకాశాలు లేక దిగులు పడిపోయాడు. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకొన్న ఉదయ్‌కిరణ్‌ 33 యేళ్లకే అంటే 05-01-2014న డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

 

ధైర్యం చెప్పే మంచి మిత్రులు ఉంటే ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకునే వారు కాదని ప్రచారం కూడా జరిగింది.. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోస్టుమార్టం నిమిత్తం హస్పిటల్‌కు తరలించిన ఆయన మృతదేహాన్ని ఒక అనాధ శవంలా పడేయగా, కనీసం బంధులు, కన్న తండ్రి కూడా రాలేదు.. కట్టుకున్న భార్య ఉండి కూడ ఉపయోగం లేకుండా పోయింది..

 

 

వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఆ కిరణం అత్యంత దయనీయస్దితిలో హస్పిటల్లో ఉండటం ఎందరో అభిమానులను కలచివేసింది.. నిజంగా అనతి కాలంలోనే ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన ఉదయ్‌కిరణ్, అంతే స్దాయిలో క్రిందకి పడిపోయాడు..దిక్కులేని ఒంటరి వాడైయ్యాడు.. ఇలాంటి మరణం ఏ హీరోకు కూడా రావద్దని ఆయన ఫ్యాన్స్ అయితే ఏడ్చారు కూడా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: