సినిమా ఇండస్ట్రీలో ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్టత ఉంటుంది.  పాత్రను బట్టి వైవిధ్యం ఉంటుంది.  పాత్ర ఎలా ఉండాలి.  ఎలా ఉంటె బాగుంటుంది అని అనుకోని పాత్రలను సృష్టిస్తూ ఉంటారు.  ఆ పాత్రలకు తగినట్టుగా మేకప్ చేస్తుంటారు. పాత్రలు మొత్తం ఒకేలా ఉంటాయి అనుకోకూడదు.  ముఖ్యంగా పాత రోజుల్లో ఎక్కువగా పురాణాలకు సంబంధించిన సినిమాలను తీసేవారు.  ఆయా సినిమాలలో ఎక్కువగా ఋషులు, రాక్షసుల పాత్రలు ఉండేవి. 


అలాంటి వాటికోసం తప్పనిసరిగా గడ్డాలు మీసాలు పెట్టుకోవాలి.  అలా పెట్టుకోకపోతే ఏమౌతుంది అంటే ఏమి కాదు.  కాకపోతే పురాణాల్లో ఋషులు, రాక్షసులకు గడ్డాలు మీసాలు ఉంటాయని అప్పటి వారి నమ్మకం.  అందుకే అలా చేసేవారు.  ఒక్కోఋషి కోసం ఒక్కోరకమైన గెడ్డం మీసం రెడీ చేసేవారట.  ఈ గడ్డాలు మీసాల కోసం అప్పట్లో ఎక్కువగా ఖర్చు చేశారు.  


ఈ పాత్రలకు ఎక్కువగా గుమ్మడి, చిత్తూరు నాగయ్య వంటి వ్యక్తులు సూటయ్యేవారు.  వారే ఎక్కువగా ఇలాంటి పాత్రలు పోషించేవారు. ఇక ఈ గడ్డాలను అతికించడానికి ముఖ్యంగా కొన్ని మాక్స్ ఫాస్ట్ గమ్ ను ఉపయోగించేవారు.  అదైతే బాగా అతుక్కుంటుందని నమ్మకం.  ఎక్కువగా చిత్తూరు నాగయ్య, గుమ్మడిలు ఈ గమ్ ను వాడేవారని అప్పటి యూనిట్ చెప్తుండేది.

 
ఇక రాక్షసులు అంటే మన మనసులో భీకర ఆకారాలు గుర్తుకు వస్తుంటాయి.  అందుకే వారికీ కూడా భయాన్ని కలిగించే విధంగా గడ్డం, మీసం, పెద్ద పెద్ద జులపాల విగ్గులు పెడుతుంటారు.  అందుకే అప్పట్లో ఈ గడ్డాలకు మీసాలకు మంచి డిమాండ్ ఉండేది.  వీటికోసం ప్రత్యేకంగా షాపులు కూడా ఉండేవి.  ఇప్పటి కాలంలో వాటి అవసరం పెద్దగా లేకుండా పోయింది.  ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు న్యాచురల్ గా గడ్డాలు పెంచుకొని సినిమాల్లో కనిపిస్తున్నారు.  అప్పుడంటే మూడు షిఫ్ట్స్ లో పనిచేసేవారు కాబట్టి ఆర్టిఫీషియల్ గా వాటిని పెట్టుకునేవారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: