టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి కనుమరుగు అయిపోయిన హీరోల్లో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. స్టార్ హీరోయిన్ కొడుకు అయినా సరే అతను టాలీవుడ్ లో నిలబడలేకపోయాడు. కెరీర్ తొలి రోజుల్లో మంచి హిట్స్ కొట్టిన తరుణ్ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని అనూహ్యంగా కనుమరుగు అయిపోయాడు. వరుసగా ఆఫర్లు వచ్చినా సరే అతను హిట్స్ కొట్టలేకపోయాడు. అతని తర్వాత వచ్చిన ఎందరో హీరోలు మంచి మంచి సినిమాలు చేస్తుంటే అతను మాత్రం సరైన కథ ను ఎంచుకోలేకపోయాడు అనేది వాస్తవం. 

 

చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ సాధించిన తరుణ్ అనూహ్యంగా ఎందుకు కనుమరుగు అయిపోయాడు అనేది ఎవరికి తెలియదు. అతని మీద జరిగిన రాజకీయాలు గాని అతని మీద జరిగిన కక్షలు గాని పెద్దగా ఏమీ లేవు అనేది కొందరి మాట. ఆర్తి అగర్వాల్ తో ఉన్న ప్రేమాయణమే అతని కెరీర్ ని నాశనం చేసింది అని అంటూ ఉంటారు. ఆమెను పెళ్లి చేసుకుంటా అని తరుణ్ మోసం చేసాడని, ఆమె అతనితో కలిసి బతకడానికి ఎన్నో ఆశలు పెట్టుకుందని, కాని తరుణ్ మాత్రం ఆమెతో ఉన్నన్ని రోజులు ఉండి ఆ తర్వాత పక్కకు పెట్టడం అతనికి శాపం అయింది అంటారు. 

 

వాస్తవానికి ఆర్తి అగర్వాల్ కూడా స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది. కాని అనూహ్యంగా ఆమె కూడా కనుమరుగు అయిపోయింది. చివరికి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె శాపమే తరుణ్ కెరీర్ ఇలా అయిపోవడానికి కారణం అని అంటూ ఉంటారు. అతని మీద పరిశ్రమలో కూడా ఒక చెడు అభిప్రాయ౦ ఏర్పడింది అని, అందుకే అతనికి మంచి అవకాశాలు ఆ తర్వాత రాలేదని చెప్తూ ఉంటారు. రెండేళ్ళ క్రితం తరుణ్ ఒక సినిమా చేసినా ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీనితో తరుణ్ ఇక కనుమరుగు అయిపోయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: