మెగాస్టార్ చిరంజీవి అల్లు ఫ్యామిలీలో అల్లుడయ్యాడంటే అది కంప్లీట్ గా అల్లు అరవింద్ గారి నిర్ణయమే అంటారు. కాబట్టే ఈ రోజు అల్లు ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ అన్నట్టు ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి. అల్లు రామ లింగయ్య చిరంజీవిని అల్లుడు గా చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన సతీమణి అల్లు కనక రత్నం గాని, చిరంజీవి గారిని చూసిన చేసుకోవాలనుకున్న అల్లు రామ లింగయ్య కూతురు సురేఖ గారు గాని ఆలోచించలేదు. కానీ అరవింద్ గారు మాత్రం ఒక్కసారి ఆలోచించాలి అన్నారట. అందుకు కారణం చిరంజీవి హీరో కాబట్టి .. అప్పటికే హీరోగా మంచి ఇమేజ్ వచ్చింది కాబట్టి.

 

ఆ ఇమేజ్ లో చిరంజీవికి ఏవైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా ... ఇంకా ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా కనుక్కోవాలని అరవింద్ గారు చిరంజీవి గారి మీద ఆరాలు తీశారట. అందులోనే అరవింద్ గారికి అసలు విషయాలు తెలిశాయి. బాగా చదువుకున్నారని, వ్యక్తిగంగా చాలా మంచి వ్యక్తి అని ..ఫ్యామిలీ అంటే చాలా మర్యాద ఇచ్చే మనిషి అని ..ఇప్పటి వరకు సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి చెడు అలవాట్లకి మొగ్గు చూపలేదని, హీరోగా ఈ స్థాయి కి రావడానికి చాలా కష్టపడుతున్నాడని అదే సాధించాడని ..ఇలా అరవింద్ గారికి చిరంజీవి గారి గురించి తెలిసింది.  

 

దాంతో అరవింద్ గారు చిరంజీవి గారిని అల్లుడుని చేసుకోవడానికి అంతా ఒప్పుకున్నారు. ఈ రోజు మెగాస్టార్ ఈ రెండు ఫ్యామిలీస్ ని ఇంత బాగా చూసుకుంటున్నారంటే అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. అయితే ఎప్పుడైతే చిరంజీవి గారి మీద అల్లు అరవింద్ ఇలా ఆరా తీశారో అప్పుడే ఆయనకి తెలీకుండానే కనెక్ట్ అయ్యారు. అప్పటి నుంచే చిరంజీవి మీద ప్రేమ అభిమానం పెరిగిపోయాయి.

 

మెగాస్టార్ కూడా అరవింద్ గారిని చాలా గౌరవిస్తారు. అల్లు ఫ్యామిలీకి అల్లుడైనప్పటికి అరవింద్ గారికి మాత్రం మంచి స్నేహితుడిలా ఉండటం గొప్ప విషయం. ఇప్పటికీ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరిని చూసి వీళ్ళు బావ బావ మరిదిలా కాదు గొప్ప స్నేహితుల్లా కనిపిస్తారాని చెప్పుకోవడం కేవలం చిరంజీవి-ఆల్లు అరవింద్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇలా ఎంతమంది ఉండగలరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: