టాలీవుడ్ లో అడుగు పెట్టిన కొంత కాలానికే మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుల్లో కమెడియన్ ఒకడు. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఈ హాస్య నటుడు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ని కెరీర్ తొలి రోజుల్లోనే సంపాదించుకున్నాడు. వరుస ఆఫర్లు, హీరోతో సమానం గా పారితోషికం తీసుకుని టాలీవుడ్ ని ఒక ఊపు ఊపాడు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో గాని కనుమరుగు అయిపోయాడు. ఎందరో స్టార్ హీరోల సినిమాలు సునీల్ కారణంగానే ఆడాయి అనేది వాస్తవం.

 

అతని హావభావాలు, అతని నటన, మాట తీరు అన్నీ కూడా అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే సునీల్ కెరీర్ ఒక్కసారిగా కనుమరుగు కావడానికి ప్రధాన కారణం అతను ఎక్కువగా ఆశపడటమే అంటున్నారు ఆయన్ను దగ్గరగా చూసిన వాళ్ళు, ఆయనను ఎక్కువగా అభిమానించిన వాళ్ళు. తనకు ఉన్న స్టార్ ఇమేజ్ తో సునీల్ హీరో అయిపోవాలని భావించాడని, ఆ ప్రయత్నమే అతని కెరీర్ ని పాతాళానికి దింపింది అనేది వాళ్ళు చెప్పే మాట. అందాల రాముడు సినిమా తర్వాత అతనికి ఎక్కువగా ఆఫర్లు వచ్చాయి.

 

సినిమా తో అతను మంచి డాన్సర్ అని కూడా అనిపించుకున్నాడు. ఆ తర్వాత అతని కెరీర్ లో చెప్పుకునే సినిమా ఏదైనా ఉందీ అంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న. ఆ సినిమా వచ్చి దాదాపు 8 ఏళ్ళు అవుతుంది. ఈ కాలంలో అతను ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. మల్టీ స్టారర్ చేసినా సరే అతనికి విజయ౦ మాత్రం దక్కలేదు. ఈ విధంగా కెరీర్ ని సునీల్ నాశనం చేసుకున్నాడు అనే వాళ్ళే ఎక్కువ. ఈ రోజు సునీల్ కమెడియన్ గా ఉండి ఉంటే అతని కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అంటున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం సునీల్ ఉంటే సినిమా అనుకునే వారు. కాని చివరికి బ్రహ్మానందం ఒకరే మిగిలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: