స్వయంవరం సినిమాతో చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు.. ఆ తర్వాత చేసిన చిరునవ్వుతో, కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. దీంతో అందరూ కూడా హీరో వేణు మంచి స్టార్ అవుతాడు అని.. సినీ ఇండస్ట్రీలో రాజ్యం ఏలుతాడు అని అందరూ భావించారు.. 

 

కానీ ఆ తర్వాత అయన చేసిన కొన్ని సినిమాల కారణంగా అయన జీవితం నాశనం అయ్యింది.. నిజానికి మంచి ఫార్మ్ లో ఉన్న సమయంలోనే అయన కొన్ని సినిమాలు కథలేకపోయిన.. ఓకే చెప్పేసి చేసేశాడు.. అంత‌వ‌ర‌కు సాఫీగా వెళ్తున్న వేణు కెరీర్ ఆ సినిమాలతో నాశనం అయిపోయింది.. 

 

అయితే అలా కావాలనే కొందరు ప్రముఖులు వేణుతో అలాంటి సినిమాలు చేయించి కెరీర్ నాశనం చేశారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. రామాచారి సినిమా విడుదలకు ముందు మాట్లాడిన వేణు.. తనకు హీరోగా గ్యాప్ రావడానికి కారణం.. కొన్ని సినిమాల కథలు నచ్చకపోయినా కొందరి కారణంగా అంగీకరించినట్టు అప్పట్లో చెప్పాడు.. అయితే అలా చెప్పడంపై సినీ విమర్శకులు చాలానే విమర్శలు చేశారు.. ''వేణులాంటి బి గ్రేడ్ హీరోకు వేషాలు రావడమే ఎక్కువ అలాంటి దానిలో కూడా అయన ఇలా చెత్త కథలు ఎవరి వాళ్ళో ఎంచుకున్న అని చెప్పడం ఏంటి'' అని అప్పట్లో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. 

 

అయితే అలా జరిగిన తర్వాత ఆ సినిమా విడుదల అవ్వడం అది ప్లాప్ అవ్వడంతో ఎనిమిదేళ్ల కింద బోయపాటి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్ బావ మరిదిగా నటించాడు. దీంతో అప్పట్లో హీరో కాస్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు.. ఇక ఇలా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తాడు అని ఆ సినిమా తర్వాత అందరూ అనుకున్నారు.. కానీ ఆ తర్వాత వేణు మ‌రే సినిమాలోను కనిపించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: