విశ్వనటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు ‘ఇండియన్ 2’.  ఈ మూవీ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉన్నాయి.  మద్యలో కమల్ హాసన్ మేకప్ విషయం.. ఎన్నికలు రావడం.. వాయిదా పడటం జరిగింది.  ఇవన్నీ పూర్తయ్యాయి.. ఇక షూటింగ్ రెగ్యూలర్ గా చేయొచ్చు అనుకుంటున్న సమయంలో మరో భారీ ప్రమాదం జరిగింది.  షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్ కుప్పకూలింది .

 

ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్శకుడు, నిర్మాత, హీరోలకు నోటీసులు కూడా జారీ చేశారు.   క్షతగాత్రులతో పాటు మరణించిన వారికి కమల్‌ హాసన్‌ కోటి రూపాయలు అందించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలని ఆదుకోవాలని, భద్రతకి సంబంధించిన కొన్ని షరతులని అంగీకరిస్తేనే తాను షూటింగ్‌లో పాల్గొంటానంటూ కమల్‌ బహిరంగ లేఖ రాసారు. దీనిపై లైకా స్పందించింది. ఫిబ్రవరి 22 కి ముందే ఈ నిర్ణయాలు తీసుకున్నాం. కాని అవి మీ దృష్టికి రాక లేఖ రాసారని మేం భావిస్తున్నాం. షూటింగ్‌ సమయంలో అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నాం.

 

ప్రొడక్షన్‌ భీమాతో పాటు వ్యక్తిగత భీమాలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధిత కుటుంబాలకి మా సంస్థ తరపున అందుబాటులో ఉన్నాం. ఇప్పటికే ఆర్ధిక స్థాయంగా రూ.2 కోట్లు ప్రకటించాం. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నాం.   బాధిత కుటుంబాలకి పూర్తి అండగా ఉంటాం. మీరు కోరినవన్నీ మేం ముందే చేశాం. సినిమా షూటింగ్‌ పునః ప్రారంభిస్తే బాగుటుందని మేం భావిస్తున్నాం అని లైకా బహిరంగ లేఖలో పేర్కొంది.  మొత్తానికి కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక అధికారిక సెక్యూరిటీ  ఉండేలా ప్రయత్నం చేయం హర్షనీయం అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: