ఇండస్ట్రీలో ఒక డోర్ మూసుకుపోయినా మరో డోర్‌ తెరుచుకుంటుంది. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకోవటం తెలిసి ఉండాలి అంతే. అలా అందిపుచ్చుకున్న వారు ఒక రంగంలో ఫెయిల్‌ అయినా మరో రంగంలో సక్సెస్‌ అవుతారు.అలా సక్సెస్‌ అయిన వారు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు సీనియర్ హీరో జగపతి బాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న జగపతి బాబు తరువాత వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. చిన్న చిన్న సినిమాలు చేసి తన ఇమేజ్‌ను తానే పాడు చేసుకున్నాడు. దీంతో జగపతి బాబు కెరీర్‌ ఇక ముసినట్టే అని భావించారు అంతా. కానీ అదే సమయంలో విలన్‌గా టర్న్‌ తీసుకొని కెరీర్‌ను కొత్తగా మొదలు పెట్టాడు. స్టార్‌ హీరోలకు విలన్‌గా బెస్ట్ చాయిస్‌ అనిపించుకుంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఇండస్ట్రీలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్‌ అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్నడు జగ్గుభాయ్‌.

 

ఇదే బాటలో సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న మరో సీనియర్ హీరో శ్రీకాంత్‌. ఈ సీనియర్ నటుడు కూడా ఒకప్పుడు ఫ్యామిలీ హీరో ఇమేజ్‌తో సినిమాలు చేసినవాడే. కానీ యంగ్ జనరేషన్‌ ఎంట్రీతో శ్రీకాంత్‌కు అవకాశాలు తగ్గాయి. దీంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ తీసుకొని కొన్ని సినిమాలు చేశాడు.ఇటీవల విలన్‌గానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇంకా సాలిడ్‌ బ్రేక్‌ రాకపోయినా నటుడిగా తన ఇమేజ్‌ను కాపాడుకుంటున్నాడు శ్రీకాంత్‌.

 

యంగ్ జనరేషన్‌ హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నటుడు నవీన్‌ చంద్ర. తొలి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించిన నవీన్‌ చంద్ర హీరోగా సక్సెస్‌ కాలేకపోయాడు. దీంతో విలన్‌గా టర్న్‌ తీసుకొని ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో సక్సెస్‌ అందుకున్నాడు. అదే జోరులో ఇతర భాషల్లోనూ విలన్‌గా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: