తండ్రి అగ్ర నిర్మాత... కెరీర్ తొలి రోజుల్లో పట్టిందల్లా బంగారమే అయింది. వరుస విజయాలు, అగ్ర దర్శకులతో సినిమాలు చేసే అవకాశం. మహిళల్లో ఫాలోయింగ్... ఏ అగ్ర హీరోకి లేని ఫాలోయింగ్ ఆయనకు వచ్చింది. తండ్రి సహకారం కోరుకోకుండా తన తండ్రి పేరు చెప్పుకోకుండా ఎదగాలని భావించాడు. అనూహ్యంగా కెరీర్ లో పడిపోవడం మొదలయింది. సినిమాలి ఫ్లాపులు అవుతున్నాయి. ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. ఒక్క హిట్ వస్తే చాలు అనుకునే టైం అది. 

 

ఈ తరుణంలో వచ్చిన హిట్, ఆయన పాత్ర మారి చేసిన సినిమా బంపర్ హిట్ అయింది. ఆయన లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆయనే జగపతి బాబు. లెజెండ్ సినిమాతో ఒక్కసారిగా లైఫ్ మారిపోయింది. కెరీర్ లో ఆయన చూసినన్ని ఆర్ధిక ఇబ్బందులు ఏ హీరో బహుసా చూసి ఉండరేమో. ఆయనకు అవకాశాలు ఇచ్చేది లేదని చెప్పిన వాళ్ళే ఆయన డేట్స్ కోసం ఎదురు చూసారు. విలన్ గా తండ్రిగా ఆయన పోషిస్తున్న పాత్రలు ఇప్పుడు జగ్గు భాయ్ కెరీర్ ని మార్చేశాయి. ఇప్పుడు ఆయన కెరీర్ లో పీక్ స్టేజి లో ఉన్నారు. 

 

ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. అలాగే తెలుగులో విలన్ గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. కీలక పాత్రలు కూడా ఆయన్నే వరిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అగ్ర హీరోల పక్కన ఏదైనా కీలక పాత్ర కావాలి అంటే జగపతి బాబు ని సంప్రదించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత౦ టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఆయన ఒకరు. హీరోల తర్వాత ఆయనే. ఆయన కోసమే కొన్ని పాత్రలు ప్రత్యేకంగా రాసుకుంటున్నారు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. ఇతర భాషల దర్శకులు ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: