తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త హీరోలు వస్తుంటారు. కొంతమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే కొంత మంది స్టార్ బ్యాక్గ్రౌండ్ తోనే వస్తారు... ఇలా వచ్చిన హీరోల్లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి వచ్చిన  హీరోలు స్టార్ హీరోలు అయితే.. స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళు జిరోలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటిన  వారు కొందరైతే. తాతల తరం నాటి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించలేనివారు ఇంకొంతమంది. బాక్గ్రౌండ్ వున్నప్పటికీ అంతగా తమ హవా నడిపించే లేని హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అక్కినేని అఖిల్. 

 

 

 అక్కినేని అఖిల్ కు  ఒక రేంజ్ లో సిని  బ్యాక్గ్రౌండ్ ఉంది. తాత అక్కినేని నాగేశ్వరరావు... తండ్రి అక్కినేని నాగార్జున... అన్న అక్కినేని నాగ చైతన్య... ఇలా ఇంత  బాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ...   ఇండస్ట్రీలో మాత్రం తన ప్రస్థానాన్ని ఇంకా మొదలుపెట్టలేదు అక్కినేని అఖిల్. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన... ఎందుకో  ప్రేక్షకులు తాత తండ్రి అన్నను ఆదరించినట్లు గా అఖిల్ ని మాత్రం ఆదరించ లేకపోతున్నారు. దీంతో సినిమాలన్నీ డిజాస్టర్ నిలుస్తున్నాయి. ఏకంగా తన కొడుకు కెరీర్ గురించి తండ్రి నాగార్జున కేర్ తీసుకునేంతగా ... అఖిల్ బాడ్ లక్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు.

 

 

 మంచి విజయం సాధించిన అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం సినిమాలో లాస్ట్ లో అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు అంతా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో  అఖిల్ ను  మాత్రం అంతగా ఆదరించ లేకపోయారు ప్రేక్షకులు. దీంతో మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత హలో సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ మరోసారి అది దురదృష్టం గానే మారిపోయింది. హలో సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక గతేడాది మిస్టర్ మజ్ను సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది కూడా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో టాలీవుడ్లో అఖిల్ కు మించిన బాడ్ లక్ హీరో ఎవరూ లేరు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: