ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చిన భామ రాశీ ఖన్నా ఆ సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. అందులో ఆమె నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు కూడా దక్కాయి. ఆ సినిమా తర్వాత చాలా మంది హీరోలతో చేసినా రాశీకి ఏదీ కలిసి రావట్లేదు. సాధారణంగా హీరోయిన్లకి సినిమాలు ఫ్లాప్ అయితే అవకాశాలు తగ్గిపోతాయి. కానీ రాశీ ఖన్నా విషయంలో ఇది రివర్స్ గా కనిపిస్తోంది.

 

 

ఆమె సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నటిస్తూనే ఉంది. కానీ ఎంతవారకయినా ఏదో ఒక టైమ్ లో హిట్ రావాల్సిందే. ఆ హిట్ కోసమే రాశీ ఖన్నా చాలా వెయిట్ చేసింది. ఆమె వెయిటింగ్ కి ప్రతిరోజూ పండగే రూపంలో బంపర్ హిట్ లభించింది. కానీ ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రతిరోజూ పండగే సినిమాలో రాశీ ఖన్నా కన్నా ఎక్కువ హైలైట్ అయింది రావు రమేష్ గారు.

 

 

రావు రమేష్ గారి వల్లే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పినా అతిశయోక్తి కాదు. అందువల్ల ప్రతిరోజూ పండగే హిట్ అయినా కూడా రాశీ ఖాతాలోకి వెళ్లలేదు. అదీగాక విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె కెరీర్ కి గట్టి దెబ్బ పడింది. విజయ్ తో చేసిన ఈ సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్న రాశీకి ఆ సినిమా ఫ్లాప్ అవడం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

 

 

ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో తెలుగు సినిమాలేవీ లేవట. అందువల్ల ఆమె కొలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయే ఆలోచనలో ఉందని అంటున్నారు. అంటే టాలీవుడ్ మీద రాశీ ఆశలు వదిలేసుకుందనే వార్త;లు గుప్పుమంటున్నాయి. ఏది ఏమైనా రాశీ ఖన్నా కెరీర్ సాగలంటే ఒక మంచి హిట్ రావాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: