సినీ ఇండ‌స్ట్రీలో వార‌స‌త్వం ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఒక పెద్ద స్టార్ హీరో కొడుకో, కూతురో, త‌మ్ముడో లేదా ఇంకో కుటుంబ స‌భ్యుడో రావ‌డం జ‌రుగుతూనే ఉంది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు స‌క్సెస్ అవుతార‌న్న గ్యారెంటీ ఖ‌చ్చితంగా లేదు. అయితే వారసత్వం మ‌రియు  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చాలామంది సినీ ఇండ‌స్ట్రీలో ఉన్నారు. రాణిస్తున్నారు కూడా. ఇక‌ నటనమీద ఓనమాలు తెలియక పోయినా సరే అందం, అభినయం లేకున్నా సరే తాము చక్రం తిప్పేయొచ్చు అనుకునే బ్రదర్స్ కి కూడా ఇండస్ట్రీలో కొదవలేదు. ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే.. హీరో శ్రీ‌కాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

హీరో శ్రీకాంత్ అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చేవి.. ఫ్యామిలీ హీరోగా ఆయన చేసిన చిత్రాలు. అయితే ఫ్యామిలీ సినిమాల్లో ఎంతగా అలరించాడో అదే స్థాయిలో ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ వంటి చిత్రాలలో కూడా వైవిధ్యమైన పాత్రల్లో తన అభినయాన్ని పండించగలిగాడు. 1991లో పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమా ద్వారా నట జీవితం ప్రారంభించిన శ్రీకాంత్ ఇప్పటి వరకు దాదాపు 125కుపైగా సినిమాల్లో నటించారు. విలన్ పాత్రలు, హీరో పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేయడంతో విరోధి అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

 

ఇక ఈయ‌న కుమారుడు రోషన్ కూడా నిర్మలా కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన శ్రీకాంత్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కెరీర్ కొనసాగించడంలో, తన ప్రతిభతో వరుస అవకాశాలు దక్కించుకోవడంలో స్టార్ హీరోగా సక్సెస్ అయ్యాడు. అయితే ఈయ‌న త‌మ్ముడు  అనిల్ ని కూడా సినిమా రంగంలోకి తీసుకుని వచ్చాడు. అయన ఒక్కటంటే ఒకే సినిమాలో హీరోగా నటించారు.  ఆ సినిమా పేరు ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా సక్సెస్ కాలేదు. 

 

ఇక‌ తరువాత నిర్మాతగా మారి తన అన్నయ్య శ్రీకాంత్ తో విరోధి అనే సినిమా నిర్మించాడు. ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. శ్రీ‌కాంత్ లాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఈయ‌న స‌క్సెస్ కాలేక‌పోయాడు. ఆ త‌ర్వాత సినిమాల్లో అడ్ర‌స్ లేకుండా పోయారు. అయితే అనిల్ సినిమాల లోకి రాకముందు అమెరికాలో సాఫ్టవేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. ఇక ప్రస్తుతం అనిల్ దుబాయ్ లో హోటల్స్ నిర్వహిస్తూ మంచి పొజిషన్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: