వెనుక బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉంటే ఏ హీరో అయినా సరే స్టార్ హీరో అవుతాడు. తాత, నాన్న, మేన మామ, ఇలా ఎవరికి స్టార్ ఇమేజ్ ఉన్నా సరే వాళ్ళు కెరీర్ లో దూసుకుపోవడం ఖాయం. వాళ్లకు నటించడం వచ్చినా రాకపోయినా, కనీసం కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియకపోయినా స్టార్ హీరోలు అయిపోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉంటే చాలు అగ్ర హీరో అవ్వడానికి ఇతర లక్షణాలు ఏమీ అవసరం లేదు అనేది వాస్తవం. కాని ఇవన్నీ ఉన్నా గాని అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ కెరీర్ మాత్రం పెద్దగా ముందుకి వెళ్ళలేదు. 

 

తాత అక్కినేని నాగేశ్వరరావు బ్రతికి ఉన్న సమయంలో కొద్దో గొప్ప ఫ్యామిలీ నుంచి మద్దతు ఉండేది. ఆ తర్వాత సుమంత్ కెరీర్ కి ఎవరి నుంచి సహకారం అందలేదు అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియదు. కాని చాలా మంది చెప్పే మాట మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని. సత్యం, మహానంది సహా పలు సినిమాల్లో అతను మంచి నటుడు అనిపించుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా అతని నటన బాగుంది. కాని అనూహ్యంగా కెరీర్ ఆగిపోయింది. 

 

నాగార్జున నుంచి సహకారం ఉంటే బాగుండేది అని కొందరు అంటూ ఉండేవారు. మరి ఏమైందో ఏమో ఆయన నుంచి కూడా సహకారం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య, అఖిల్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. వాళ్లకు తండ్రి ఇమేజ్ ఉపయోగపడింది. కాని సుమంత్ కి మాత్రం ఉపయోగపడలేదు అనేది వాస్తవం. అన్నపూర్ణ స్టూడియో లో కూడా ఆయన ప్రాధాన్యత అక్కినేని మరణం తర్వాత తగ్గిపోయింది అనే మాటే ఎక్కువగా వినపడుతుంది. ప్రస్తుతం సుమంత్ చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవని సమాచారం. ఇక కీర్తి రెడ్డి తో పెళ్లి కూడా సుమంత్ ని ఇబ్బంది పెట్టింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: