హీరో సుమన్ ఒకప్పుడు స్టార్ హీరో.  యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు. అయితే, అయన కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం వలన సినిమా ఇండస్ట్రీలో వెనకబడిపోయారు.  లేదంటే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మాదిరిగా ఆయనకు ఒక స్టార్ డమ్ ఉండేది.  అప్పట్లో యాక్షన్ అంటే సుమన్ అనే వారు.  అయన కరాటేలో మంచి ప్రావిణ్యం సంపాదించారు.  సినిమా రంగంలోనే కాదు, దేశం కోసం కూడా అయన ఎప్పుడు ముందే ఉంటారు.  


1999 లో ఇండియా, పాక్ దేశాల మధ్య కార్గిల్ వార్ జరిగింది.  ఈ వార్ తరువాత ఇండియన్ ఆర్మీ కోసం దేశంలో చాలామంది వారికీ తోచింది సహాయం చేశారు.  సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు కూడా లక్ష, రెండు లక్షలు ఇలా ఎవరికీ తోచింది వారు సహాయం చేశారు.  అయితే, అదే సమయంలో కొంతమంది సుమన్ కు ఫోన్ చేసి మీరు ఏం సహాయం చేస్తున్నారని అడిగితె, అయన మరో మాట మాట్లాడకుంటా తన 175 ఎకరాల భూమిని ఆర్మీ కోసం ఇస్తున్నట్టుగా ప్రకటించి అప్పట్లో సంచలనం సృష్టించారు.  


ప్రస్తుతం ఈ భూమి కి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి.  త్వరలోనే ఆ భూమి తన సొంతం కాబోతున్నదని, ఆ భూమిని ఇండియన్ ఆర్మీకి అందజేస్తానని అంటున్నారు.  మొదట తాను ఆ భూమిలో స్టూడియో నిర్మించాలని అనుకున్నారట.  కానీ, తన భార్య భూమిని ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలని కోరిందని, భార్య మాటకు కట్టుబడి ఇండియన్ ఆర్మీకి భూమిని ఇస్తున్నట్టు చెప్పారు సుమన్.  


షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు బోర్డర్ కు వెళ్లానని,అక్కడ ఆర్మీ సాహసాలు చూసి షాక్ అయ్యినట్టు చెప్పారు.  దేశం కోసం వారు పడుతున్న ఆవేదన మనసును కదిలించి వేసినట్టు చెప్పారు.  అందుకోసమే భూమిని వారిని ఇచ్చిట్టు చెప్పారు.  భూమికి సంబంధించిన పత్రాలను త్వరలోనే ఆర్మీకి అందజేస్తానని చెప్పారు.  ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశం కోసం పోరాటం చేస్తున్న వారిని ఇంతకంటే ఇంకేం చేయగలమని సుమన్ చెప్తున్నారు.  సుమన్ లాంటి మంచి మనసు అందరికి ఉంటె ఎంత బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: