జూనియర్ త్రివిక్రమ్ ల దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా వల్ల కళ్యాణ్ రామ్ కు వచ్చిన ఒక మంచి అవకాశం పోగొట్టుకోవలసి వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. 


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరో వదులుకోరు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ అలాంటి అవకాశం పోగొట్టుకున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య మైత్రీ మూవీస్ నిర్మాతలు ఒక ప్రముఖ దర్శకుడుతో కలిసి వెళ్ళి ఒక డిఫరెంట్ కథను వినిపించినట్లు టాక్. 


అయితే ఈ మూవీ కథ రీత్యా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయవలసి ఉంటుంది. దీనికోసం కళ్యాణ్ రామ్ భారీ హోమ్ వర్క్ చేయాలి. అయితే ఈ పాత్ర గురించి ఎక్కువగా వర్క్ చేస్తూ తన టైమ్ అంతా ఈమూవీ ప్రాజెక్ట్ కోసం పెడితే త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను జూనియర్ తో నిర్మించబోయే మూవీ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టలేనని భావించి కళ్యాణ్ రామ్ సున్నితంగా మైత్రీ మూవీ మేకర్స్ ను పక్కకు పెట్టినట్లు టాక్. 


ప్రస్తుతానికి కళ్యాణ్ రామ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మల్లిడి వేణు డైరక్షన్ లో సొంత బ్యానర్ మీద ఒకటి విఐ ఆనంద్ డైరక్షన్ లో మహేష్ కోనేరు నిర్మించేది మరోటి. గుహాన్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే సినిమా మరొకటి. ఇలా వరసపెట్టి కళ్యాణ్ రామ్ సినిమాలు చేయడం వెనుక జూనియర్ ప్రోత్సాహంతో పాటు పరోక్షంగా తారక్ సహకారం లభిస్తోంది అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు సినిమాలు తీస్తూ మరొకవైపు సినిమాలు చేస్తూ కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రతి వ్యూహం వెనుక జూనియర్ ముద్ర ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: