తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి వైజయంతీ మూవీస్. సంస్థ అధినేత అశ్వనీదత్ ఈ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలు నిర్మించాడు. ఎన్టీఆర్ తో మొదలైన ఆయన బ్యానర్ కీర్తి మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎవరెస్ట్ శిఖర స్థాయికి చేరుకుంది. త్వరలో ఈ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్నాడు అశ్వనీదత్. ప్రభాస్ హీరోగా తన అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుందని అఫిషియల్ గా ప్రకటించేశాడు.

 

 

అయితే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.. అసలు ఈ కథ ప్రభాస్ కోసమే రాసిందా.. లేక కథ రాసాక ప్రభాస్ వద్దకు వెళ్లిందా.. అని. నిజానికి ఆమధ్య అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి కోసమే నాగ అశ్విన్ కథ రాస్తున్నాడు. కథ పూర్తయితే గానీ అది చిరంజీవికి సరిపోతుందో లేదా వేరేవాళ్లకు సూటవుతుందో తెలీదు అని క్లియర్ గానే చెప్పాడు. కట్ చేస్తే.. ప్రభాస్ తో సినిమా అని అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అయితే.. ఈమధ్య ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు చిరంజీవి పాజిటివ్ గా మాట్లాడిన విషయం.. దీనిపై అశ్వనీదత్ ఆగ్రహం వ్యక్తం చేసి చిరంజీవి గురించి వ్యతిరేకంగా మాట్లాడటమూ తెలిసిందే.

 

 

ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయా.. అందుకే చిరంజీవితో కాకుండా ప్రభాస్ తో అశ్వనీదత్ సినిమా చేస్తున్నాడా.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కథ డిమాండ్ చేస్తే ఒకే గానీ.. గొడవలే కారణమైతే అశ్వనీదత్ కాదు గానీ.. నాగ అశ్విన్ కు మాత్రం మెగాస్టార్ చిరంజీవిని డైరక్ట్ చేసే మహాద్భుతమైన అవకాశం చేజారినట్టే. చిరంజీవి కోసం మరో కధ ఉందా.. ఇక లేనట్టేనా అనే అంశంపై అశ్వనీదత్, అశ్విన్ లే క్లారిటీ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: