ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఇ.వి.వి.సత్యనారాయణ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. ఈ క్ర‌మంలోనే ఆర్యన్ రాజేష్ హీరోగా ఫెయిల్యూర్ అయ్యాడు. ఇవివి సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆర్జ‌న్ రాజేష్‌. సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో నికిత హీరోయిన్‌గా న‌టించింది. అయితే అంత పెద్ద బ్యాన‌ర్‌పై నిర్మించినా ఈ సినిమా హిట్ అవ్వ‌లేదు. హాయ్ సినిమాతో పరిచయమైన ఈయన ఆ త‌ర్వాత‌ 10 సినిమాల దాకా చేసినా సక్సెస్ మాత్రం దక్కించుకోలేదు. 

 

మంచి రూపం ఉన్నా కూడా అదృష్టం లేక పోవడం వల్లో లేక మరేంటో కాని ఆర్యన్ రాజేష్ హీరోగా సెట్ కాలేక పోయాడు. హీరోగా చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ లే ఉండటంతో మెల్ల మెల్లగా ఆఫర్లే కనుమరుగయ్యాయి. దాంతో చాలా ఏళ్లు ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటూ వచ్చాడు. వాస్త‌వానికి ఇ.వి.వి.సత్యనారాయణ ఆర్జ‌న్ రాజేష్‌ను మంచి హీరోగా తీర్చిదిద్ద‌డ‌యే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే సొంత బ్యాన‌ర్‌పై ఆర్జున్ రాజేష్‌తో ఎన్నో సినిమాలు చేశారు. కాని, అవి స‌క్సెస్ కాలేదు. ఇక మ‌రోవైపు అల్ల‌రిన‌రేష్  కామెడీ హీరోగా బాగానే దూసుకుపోతున్నారు. ఓ మోస్త‌రు హిట్ల‌తో ఆఫ‌ర్లు కూడా బాగానే ద‌క్కించుకుంటున్నారు. వాస్త‌వానికి అల్ల‌రి న‌రేష్‌తో పోల్చుకుంటే ఆర్జ‌న్ రాజేష్ అందంలో, అభిన‌యంలో ఓ మెట్టుపైనే ఉంటారు. 

 

కానీ, సినీ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు. అయితే ఈయ‌న ఎంచుకునే క‌థ‌ల వ‌ల్లే సినిమాలు ఫ్లాప్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఎంచుకునే క‌థ‌లో రాంగ్ స్టెప్ వేయ‌డం వ‌ల్లే ఆయ‌న సినీ కెరీర్ నాశ‌నం అయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, చాలా కాలం త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గా సపోర్టింగ్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఆర్యన్ రాజేష్. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈ చిత్రం  తర్వాత వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించాలని ఆర్యన్ రాజేష్ భావిస్తున్నాట్టు తెలుస్తోంది. అందుకోసం తనకు పరిచయం ఉన్న దర్శకులను కలుస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: