స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరోలలో ఒకరు అల్లు అర్జున్. నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గంగోత్రి సినిమా తో పరిచయమైన అల్లు అర్జున్... ఇక ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్న అల్లు అర్జున్... ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ ఏం చేసినా స్టైల్ గానే  ఉంటుంది... డాన్స్ చేసిన అదో సపరేట్ స్టైల్..ఏ  డ్రెస్ వేసినా అది కూడా స్టైల్ గా మారిపోతుంది...ఇక  హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... అల్లు అర్జున్ సినిమాలో హెయిర్ స్టైల్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. 

 

 

 అందుకే అల్లు అర్జున్ ను  స్టైలిష్ స్టార్  గా  పిలుచుకుంటారు అభిమానులు. అయితే అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి... తన ప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్  కొనసాగిస్తున్నాడు. ఇక మొన్నటికి మొన్న అలా  వైకుంఠపురములో  సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్. తన కెరీర్లోని బెస్ట్ విజయాన్ని అల్లు అర్జున్ అందుకున్నాడు. అయితే స్టార్ హీరోలు అన్నప్పుడు వాళ్ళ వీక్నెస్ ల గురించి తెలుసుకోవడానికి అభిమానులు కానీ నెటిజన్లు కానీ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. దీనికోసం ప్రత్యేకంగా గూగుల్ తల్లిని ఆశ్రయిస్తుంటారు. 

 

 

 అయితే ఒకానొక సమయంలో అల్లు అర్జున్ తన వీక్నెస్ ల గురించి చెప్పుకొచ్చారు. తాను తన వీక్నెస్ ల గురించి ఎక్కడా బయట చెప్పనని ఎందుకంటే అలా చెబితే... తాను సినిమాల్లో నటించినప్పుడల్లా కేవలం అభిమానులు నా వీక్నెస్ ని మాత్రమే గమనిస్తారు అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే ఓ ఈవెంట్ లో మాత్రం... తాను  కాస్త ఎమోషనల్ అయితే తన మైండ్ బ్లాక్ అయిపోతుందని... మాటలు రావు అంటూ అల్లు అర్జున్ చెప్పకనే తన వీక్నెస్ ఏంటో చెప్పేసాడు. ఇక ఇప్పటి వరకు మిగతా వీక్నెస్ ల  గురించి అయితే ఎక్కడ బయటపెట్టలేదు  అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: