టాలీవుడ్ అగ్ర నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. దాదాపు 40 ఏళ్ళకు పైగా సినీ ప్రస్థానంలో వందల సినిమాలలో నటించారు మెప్పించారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎందరో అగ్ర దర్శకులతో హిట్ సినిమాలు చేసారు మోహన్ బాబు. టాలీవుడ్ లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మోహన్ బాబు. ఆయనకు అంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే ఆయన తనయులు మంచు మనోజ్, మంచు విష్ణు మాత్రం టాలీవుడ్ లో ఎక్కువ కాలం నిలబడలేకపోయారు అనేది వాస్తవం. తండ్రికి ఉన్న స్టార్ ఇమేజ్ వాళ్లకు ఉపయోగపడలేదు. 

 

మంచు విష్ణు కెరీర్ తొలి రోజుల్లో ఒకటి రెండు మంచి సినిమాలు చేసారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా ఆయనకు మంచి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత చెప్పుకోదగిన హిట్స్ ఆయనకు రాలేదు. నటన పరంగా విష్ణు ఆకట్టుకున్నా ఆయనకు కథలు ఎంపిక చేసుకోవడం తెలియక, దర్శకుల ఎంపికలో చేసిన తప్పులు  కెరీర్ ఇబ్బంది పడుతూ వచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా సరే సరైన హిట్ మాత్రం అతనికి రాలేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

ఇక మంచు మనోజ్ కూడా కథలు ఎంపిక చేసుకోవడం రాకే సినిమాల్లో నిలబడలేకపోయారు. మాస్ కథలను నమ్ముకుని సినిమాలు చేసినా అవి పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. తండ్రి వాయిస్ ఉన్నా సరే ఆయన గుర్తింపు కోసం కష్టపడాల్సి వస్తుంది. దర్శకులు కూడా మంచు మనోజ్ కి తగిన విధంగా కథలు రాయలేకపోవడం, అటు తండ్రి నుంచి సరైన సహకారం లేకపోవడంతో మంచు మనోజ్ కెరీర్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు భారీ బడ్జెట్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే అతను నిలబడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: