అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఐదు పదుల వయస్సు దాటి పోయినప్పటికీ.. ఇప్పటికీ టాలీవుడ్ మన్మధుడు గానే కొనసాగుతున్నారు నాగార్జున. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కింగ్ నాగార్జున గా మారిపోయారు. ఇక అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున నట వారసులుగా  తెలుగు చిత్ర పరిశ్రమకి అక్కినేని అఖిల్ అక్కినేని నాగ చైతన్య పరిచయమైన విషయం తెలిసిందే. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం.. నాగార్జున భార్య అమల.. నాగార్జున కు రెండవ భార్య అన్న విషయం ఇప్పటికీ కొంతమంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అక్కినేని అఖిల్ నాగార్జున అమల దంపతులకు జన్మించాడు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం నాగార్జున మొదటి భార్యకు జన్మించాడు. అయితే నాగార్జున మొదటి భార్య సీనియర్ హీరో వెంకటేష్ సోదరి లక్ష్మి. మొదట వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ వివిధ కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. 

 

 

 అప్పటికే వీరిద్దరికీ నాగచైతన్య పుట్టాడు. అయితే నాగార్జున తన మొదటి భార్య లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత.. హీరోయిన్ అమల ను పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అమల నాగార్జున లు అన్యోన్య దంపతులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇక నాగార్జున తో విడిపోయిన తర్వాత నాగార్జున మొదటి భార్య లక్ష్మి కూడా శరత్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని అమెరికా వెళ్లి పోయారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య బాధ్యతలన్నీ మేనమామ అయిన వెంకటేష్ చూసుకున్నారని తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాగచైతన్య కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: