నరేష్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు. అల్లరి అనే చిత్రంతో తెలుగు చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల తెలుగు ప్రజలకు అల్లరి నరేష్ గా సుపరిచితుడు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ పాత్రలే కాకుండా అన్ని రకాల కారెక్టర్స్ చేసాడు ఈయన. అయితే అందులో కామెడీ ఎక్కువగా ఉండటంతో నరేష్ అంటే కేరాఫ్ కామెడీ అయిపోయాడు. అల్ల‌రి న‌రేష్‌ సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 18 ఏళ్లు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న 56 సినిమాలు చేశారు. ఈ నేప‌థ్యంలోనే మినిమమ్‌ హిట్‌ గ్యారెంటీగా హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్‌.

 

అలాగే ఒకే సంవ‌త్సరంగా మూడు, నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన రోజులూ ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈవీవీ ఆకస్మిక మరణం అల్ల‌రి న‌రేష్‌ను మ‌రియు ఆర్య‌న్ రాజేష్‌ను కుంగదీసింది. ఆయన లేని లోటు ఆ ఇద్దరికే కాదు మొత్తం పరిశ్రమకి కూడా కనిపించింది. వాస్త‌వానికి ఈవీవీ ఉన్న‌ప్పుడు కుమారుల‌తో ఏడాదికి ఒక్క సినిమా అయినా తీసి మంచి హిట్ ఇచ్చుకుంటూ వ‌చ్చేవారు. కానీ, ఆయ‌న మృతితో అల్ల‌రి న‌రేష్‌కు, ఆర్య‌న్ రాజేష్‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. చివ‌ర‌కు సొంత బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో బందిపోటు సినిమా చేస్తే.. అది కూడా ప్లాప్ అయింది. ఇక ఆ త‌ర్వాత‌ అల్ల‌రి న‌రేష్ కాస్తో కూస్తో హిట్ సినిమాలు చేసినా ఆర్య‌న్ రాజేష్ పూర్తిగా సినిమాల‌కు దూరం అయ్యారు. 

 

అయితే టాలీవుడ్ లో అత్యంత వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన అల్లరి నరేష్ కెరీర్ ఇటీవలి కాలంలో ఫ్లాపులతో గాడి తప్పింది. కామెడీ ఎంటెర్టైనర్లతో పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం, తాను హీరోగా చేసిన సినిమాలు వరసగా ప్లాపులు కావడం వీటికి కారణాలు కావొచ్చు. దానిని దారిలో పెట్టేందుకు చాలానే ప్రయాసలు పడుతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే చాలా కాలం గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షిలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్‌తో పాటు అల్లరి నరేష్ నటన ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. 

 

చాలాకాలం తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌‌లో చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిచ్చింది. వాస్త‌వానికి ఇలా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేయ‌డం వ‌ల్ల‌ న‌రేష్ సినీ కెరీర్ పెంచుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఒక‌ప్పుడు మంచి హిట్లు ఇచ్చిన అల్ల‌రి న‌రేష్ మ‌ళ్లీ ఫ్రెష్ కామెడీ, బ‌ల‌మైన క‌థ‌తో హీరోగా వ‌స్తే ప్రేక్ష‌కులు ఖ‌చ్చితంగా ఆదరిస్తారు అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. కాగా, ప్ర‌స్తుతం అల్లరి నరేష్ హీరోగా నాంది పేరుతో మరో సంచలన సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  మ‌రి ఈ సినిమా ఎంత వ‌ర‌కు న‌రేష్‌ను స‌క్సెస్ ప‌ట్టాలెక్కిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: