ఉదయ్ కిరణ్ చక్కటి నటుడు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాక తమిళ సినిమాల లో మంచి నటుడి గా స్థానం సంపాదించుకున్నాడు ఈ హీరో. ఉదయ్ కిరణ్ మొదటి నటించిన మూడు సినిమాలు తిరుగులేని విజయాలు అయ్యాయి. బాక్స్ ఆఫీస్ ని బద్దల కొట్టడం వల్ల హీరో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హీరో బిరుదు సంపాదించుకున్నాడు.
 
 
IHG
 
ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాల లో నువ్వు నేను, చిత్రం సినిమాలు చెప్పుకో దగినవి. అయితే నువ్వు నేను చిత్రం 2001 లో వచ్చింది. అలానే చిత్రం సినిమా 2000 లో విడుదల అయ్యింది. ఈ రెండు చిత్రాలు కూడా చక్కటి పేరు తెచ్చిపెట్టాయి ఉదయ్ కిరణ్ కి. చిత్రం సినిమా తో పరిచయం అయ్యాడు ఈ హ్యాట్రిక్ హీరో.
 
 
ఆ తరువాత నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని ఇలా అనేక సినిమాల లో హీరో ఉదయ్ కిరణ్ నటించాడు. నువ్వు నేను చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు ని కూడా దక్కించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఇలా అనేక సినిమాల లో విభిన్న పాత్రల్లో నటించాడు.
 
 
IHG
 
 
గుండె ఝల్లుమంది, ఏక లవ్యుడు, ఈ పెద్దోళ్ళున్నారే, జైశ్రీరాం, చిత్రం చెప్పిన కధ వంటి సినిమాల లో నటించినప్పటికీ అంత స్థాయి కి చేరుకోలేదు ఈ సినిమాలు. తమిళం లో పాయ్ చిత్రం తో అడుగు పెట్టాడు. ఇలా సినిమాల లో నటిస్తూ వచ్చాడు. కానీ రాను రాను సినిమాలు హిట్ అవ్వలేదు. కాలం కలిసి రాలేదు హీరో ఉదయ్ కిరణ్ కి.
 
 
 
ఆ తరువాత సినిమాల కి, ప్రపంచానికీ దూరం  అయ్యి పోయాడు ఈ హ్యాట్రిక్ హీరో. కానీ నటన ఎంతో చెప్పుకో దగినవి. సినిమాలు చూసే కొద్దీ చూడాలనిపించేవి. హిట్స్ లేక కధలు రాక దూరం అయ్యి పోయాడు శాస్వతం గా చివరికి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: