అనసూయ.. పరిచయం అక్కర్లేని పేరు. తన యాంకరింగ్ తో కుర్రకారుని హుషారెత్తించే జోరు ఆమె సొంతం. అందుకే యాంకరింగ్ ప్రపంచంలో ఎంత కాంపిటేషన్ వున్నా కూడా, తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. ఓ వైపు వరుసగా టివి షోలతో మంచి బిజీగా వున్న అనసూయ, మరోవైపు భిన్నమైన పాత్రలతో అటు సినిమాల్లో తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ ఇమేజ్ పెంచుకుంటుంది. ఇప్పటికే అనసూయ అంటే మంచి నటిగానే కాదు సూపర్ గ్లామర్ గర్ల్ గా కూడా ఇమేజ్ తెచ్చుకుంది. 

రెండు సంవత్సరాల క్రితం క్షణం సినిమాలో నెగిటివ్ రోల్ లో మంచి మార్కులు కొట్టేసింది అమ్మడు. ఇక, రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా తనదైన నటనతో ఆకట్టుకున్న అనసూయకు మళ్ళి ఆ రేంజ్ లో ఉన్నటువంటి పాత్రను అఫర్ చేసాడు దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అనసూయ కీ రోల్ పోషించనున్నట్టు భోగట్టా. నెగిటివ్ షేడ్ లో మళ్ళీ మెరవనుందట! లేటెస్ట్ గా రెండో షెడ్యూల్ కేరళలో మొదలైంది. 

త్వరలోనే షూటింగ్ జరుపబోతున్న రెండో షెడ్యూల్లో అనసూయ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పాటుగా లేటెస్ట్ గా భీష్మ తో మంచి హిట్ అందుకున్న నితీన్, హిందీలో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో హిందీలో టబు పోషించిన పాత్రలో.. అనసూయ నటిస్తుందని సమాచారం. వాస్తవానికి ఆ పాత్రలో టబు నే ఉంచాలని అనుకున్నారు, కానీ ఆమె రెమ్యూనరేషన్ ఎక్కవగా డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్ లో అనసూయను ఖరారు చేసుకున్నట్టు వినికిడి.

ఏదేమైనా అనసూయ టైం బావుంది.. ఒక హై రేంజ్ వున్న సీనియర్ హీరోయిన్ టబు పాత్రను చేయడమంటే మాములు విషయం కాదు. ఆ సినిమాలో టబు కేవలం తన హావ భావాలతో సినిమాను రక్తి కట్టించింది. అలాంటి పాత్రకు ఈమె ఏమేరకు న్యాయం చేస్తుందో అటుంచితే, అవకాశాన్ని అంది పుచ్చుకోవడంలో అనసూయకు అనసూయే సాటి అని, టాలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: